Shraddha Das : బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి

ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. ఆ బాటలోనే నటి శ్రద్ధా దాస్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ఆ నటి క్లారిటీ ఇచ్చేసారు.

Shraddha Das

Shraddha Das : శ్రద్ధా దాస్.. మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్‌గా మారి 15 సంవత్సరాలు అవుతోంది. ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’తో మొదలుపెడితే వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ నటి ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై శ్రద్ధ క్లారిటీ ఇచ్చారు.

Mirnaa Menon : మైమరపిస్తున్న మిర్నా మీనన్ అందాలు..

ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కారు. ఆ బాటలోనే శ్రద్ధా దాస్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. 2008 లో సిద్దూ ఫ్రమ్ సికాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రద్ధ తెలుగు, మళయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ సినిమాల్లో నటించారు. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రమే అనే రూల్ పెట్టుకోకుండా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ ఉన్నారు. టీవీ షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు శ్రద్ధా దాస్.

Ashika Ranganath : బ్లాక్ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ఆషికా..

ఇటీవల శ్రద్ధా దాస్ ఓ బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నారని.. అతనినే పెళ్లాడబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ పుకార్లే అని శ్రద్ధా కొట్టి పారేసారు. తాను ఎవరితోను డేటింగ్‌లో లేనని స్పష్టం చేసారు. డార్లింగ్, ఆర్య 2 వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకుని నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్తున్న శ్రద్ధ సింగర్ కూడా. ఓ వైపు సినిమాలు.. మరోవైపు  రియాలిటీ షోలు, ఈవెంట్స్‌లలో కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు శ్రద్ధా దాస్.