‘మా’ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా హేమ

  • Publish Date - March 9, 2019 / 12:56 PM IST

‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎలక్షన్ వాతావరణాన్ని వేడెక్కించేశారు. ‘మా’ ఎన్నికలు కాస్త పొలిటకల్ హీట్‌ను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నటి హేమ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఆదివారం నాడు జరగనున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె సిద్ధం అయ్యారు.
Read Also : హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్

ఈ ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజా ప్యానెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవికి హేమ స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడుతున్నది. గతంలో శివాజీరాజా ప్యానల్‌లో హేమ జాయింట్ సెక్రటరిగా బాధ్యతలు నిర్వహించగా.. పలుమార్లు ఈసీ మెంబర్‌గా కూడా పనిచేసింది. అయితే స్వతంత్రంగా పోటీ చేయడానికి కారణం తనకు శివాజీరాజా ప్యానెల్‌లో సరైన ప్రాధాన్యత దక్కకపోవడమే అని ఆమె చెబుతుంది.

అయితే అందరం ‘మా’ సభ్యుల సంక్షేమం కోసమే కృషి చేస్తామని, మహిళా సభ్యులందరి మద్దతు తనకే ఉంటుందని ఆమె అన్నారు. మహిళల సమస్యలపై పోరాడతానని, రెండు ప్యానల్స్‌తో తనకెలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. రెండు ఉపాధ్యక్ష పదవులకు పోటీ పడుతున్న వారిలో హేమతో పాటు బెనర్జీ, హరనాథబాబు, మాణిక్, ఎస్వీ కృష్ణారెడ్డిలు ఉన్నారు.
Read Also : ‘MAA’ ఎన్నికల హామీలు : చిరంజీవి కల్యాణలక్ష్మి, ఫించన్లు..

ట్రెండింగ్ వార్తలు