Actress Hema
Actress Hema: సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళొచ్చింది. ఈ కేసులో హేమ తానేమి తప్పు చేయలేదని పోరాడింది. ఇటీవలే ఆ కేసులో హేమ ఎలాంటి తప్పు చేయలేదని, డ్రగ్స్ తీసుకోలేదని కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ కేసు తర్వాత హేమ 10 టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా పలు అంశాలపై మాట్లాడింది.(Actress Hema)
ఈ క్రమంలో హేమపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ చేసింది, ఎలా స్పందించింది అని మాట్లాడారు.
Also Read : Samantha : పెళ్లి తర్వాత అత్తగారి ఫ్యామిలీతో సమంత.. ఫుల్ ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఈ ఫొటోలో ఎవెరెవరు ఉన్నారంటే..
హేమ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నాకు అందరూ సపోర్ట్ చేసారు. లాయర్లు కావాలా, కార్ కావాలా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తామన్నారు. నేను పనిచేసిన హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు అంతా సపోర్ట్ చేసారు. చిరంజీవి గారు అయితే వాళ్ళ మనిషిని పంపి తనేంటో మనకు తెలుసు తనకు ఏం కావాలో చూడండి, డబ్బులు కావాలా, లాయర్లు కావాలా అడగండి అని సపోర్ట్ చేసారు. రీసెంట్ గా నాగార్జున గారు కూడా మాట్లాడారు. ఆయన దగ్గర అయితే ఏడ్చేసాను. నా ఫేవరేట్ హీరో ఆయన అని అందరికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. నేను అసలు మందే తాగను కదా అని నాగార్జున గారే అన్నారు. ఆయనకు తెలుసు నా గురించి అని తెలిపింది.
ఇక విష్ణు కూడా మా మెంబర్షిప్ అతను లేనప్పుడు సస్పెండ్ చేస్తే వచ్చి నా కార్డ్ మళ్ళీ నాకు ఇచ్చారు. నిజం తేలేదాకా నిందలు వేయొద్దు అంటూ నాకు సపోర్ట్ చేసారు అని తెలిపింది హేమ.
Also Read : Actor Nandu : భార్య డబ్బుల మీద బతుకుతున్నా అన్నారు.. ఢీ షోకి ఎందుకు వెళ్ళానంటే.. నందు కామెంట్స్ వైరల్..