Actor Nandu : భార్య డబ్బుల మీద బతుకుతున్నా అన్నారు.. ఢీ షోకి ఎందుకు వెళ్ళానంటే.. నందు కామెంట్స్ వైరల్..

నందు సైక్ సిద్దార్థ్ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. (Actor Nandu)

Actor Nandu : భార్య డబ్బుల మీద బతుకుతున్నా అన్నారు.. ఢీ షోకి ఎందుకు వెళ్ళానంటే.. నందు కామెంట్స్ వైరల్..

Actor Nandu

Updated On : December 2, 2025 / 9:44 PM IST

Actor Nandu : నటుడు నందు ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. కానీ గత కొన్నాళ్లుగా టీవీ లోకి కూడా వచ్చాడు. ఢీ షోలో యాంకర్ గా చేస్తున్నాడు. మరో పక్క ఐపీఎల్ లో హోస్ట్ గా చేస్తున్నాడు. నందు – సింగర్ గీతా మాధురి ప్రేమించుకొని 2014 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(Actor Nandu)

నందు సైక్ సిద్దార్థ్ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. ఈ క్రమంలో తన భార్య గురించి, టీవీ లోకి ఎందుకు వచ్చాడో అని తెలిపాడు.

Also Read : Sivaji Raja : దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే.. కానీ.. 101 జ్వరంతో వర్షంలో డ్యాన్స్.. మెగాస్టార్ పై శివాజీ రాజా కామెంట్స్..

Actor Nandu

నందు మాట్లాడుతూ.. నేను గీతా మాధురి డబ్బుల మీద బతుకుతాను అన్నారు. అలాంటి మాటలు చాలా విన్నాను. చాలా హర్టింగ్ గా ఉంటుంది. నేను ఒక సినిమా చేసి ఎంత సంపాదిస్తానో తను ఒక అయిదారు షోలు చేసి అంతే సంపాదిస్తుంది. కానీ నా సినిమా వచ్చి వెళ్ళిపోతుంది. తన షోలు ఒకసారి షూటింగ్ చేస్తే మూడు నెలలు అంతా టెలికాస్ట్ అవుతుంది. తను ఎక్కువ కనపడటంతో జనాలు అలా అనుకుంటారు. ప్రతి ఒక్కరు మనకు సొంత గుర్తింపు ఉండాలి అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను. తను ఎంత పనిచేస్తుందో నేను అంతే పనిచేస్తున్నాను ఎందుకు ఇలా అనుకునేవాడిని.

నా సినిమా ఒక సంవత్సరం కష్టపడి చేస్తే ఒక షోతో నా ఫేట్ డిసైడ్ అయిపోతుంది. కానీ గీత ఎక్కువ ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది కాబట్టి తను ఎక్కువ సక్సెస్ అనుకుంటారు జనాలు. నాకు కూడా టీవీ ఛాన్సులు చాలా వచ్చాయి కానీ వదులుకున్నాను. నా చుట్టూ ఉండే కొంతమంది జనాలు నువ్వు తోపు, హీరో అన్నారు. నాకు రియాలిటీ లేట్ గా తెలిసింది. మనకి మనం నిలబడాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నాను. అప్పుడు మల్లెమాల నుంచి ఢీ ఛాన్స్ వచ్చింది. మొదట శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఢీ లో మెంటర్ కింద అడిగారు. అప్పుడు ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. కానీ తర్వాత ఢీ కి యాంకర్ గా అడిగారు.

ఇప్పుడు జనాలకు నేను ఎక్కువగా తెలుసు. ఐపీఎల్ తో మరింత క్లోజ్ అయ్యాను జనాలకు. జనాలకు ఎంత ఎక్కువ కనిపిస్తే అంత క్లోజ్ తీసుకుంటారు. ఐపీఎల్ తర్వాత చాలా మంది ఫ్యాన్స్ నాతో మాట్లాడారు. ఓ రోజు అమలాపురంలో షూట్ చేస్తుంటే చిన్న పాప మీరు ఢీ షో యాంకరా అండి అని అడిగింది. అంత బాగా జనాలకు నేను తెలిసాను. టీవీ వల్ల నేను జనాలకు బాగా కనెక్ట్ అయ్యాను, టీవీ నుంచి వచ్చే డబ్బులతో నా ఫ్యామిలీ నడుపుకుంటూ అందులోనే కొంత దాచుకొని ఈ సినిమా తీసాను అని తెలిపాడు.

Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థ్యాంక్యూ మీట్.. ఫొటోలు..