Hema: మంచు లక్ష్మి ఎపిసోడ్.. మంచు విష్ణుపై హేమ ఫైర్

మా అసోసియేషన్ పై నటి హేమ ఫైర్ అయ్యారు. ఇటీవల మంచు లక్ష్మి(Hema) గురించి మాట్లాడిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ప్రశ్నించారు.

Actress Hema responds to Manchu Lakshmi issue

Hema: మా అసోసియేషన్ పై నటి హేమ ఫైర్ అయ్యారు. ఇటీవల మంచు లక్ష్మి గురించి మాట్లాడిన వాళ్లపై ఎందుకు(Hema) చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. మంచు విష్ణు ఎం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు ఆమె వీడియో బైట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ దక్ష. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూకి వెళ్లారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా సదరు యాంకర్.. 47 ఏళ్ళు వయసున్న మహిళా, 12 ఏళ్ళ కూతురున్న మహిళా ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి అని సమాజం కామెంట్స్ చేస్తుంది” కదా అంటూ ప్రశ్నించాడు.

Aamir Khan: మహాభారతం సీరీర్ కోసం 30 ఏళ్ళ ప్రణాళిక.. అంతా సిద్ధంగా ఉండండి.. ఆమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

దానికి మంచు లక్ష్మి కూడా ఘాటుగానే స్పందించింది. మీకు ఎంత దైర్యం ఉంటే ఈ ప్రశ్న నన్ను అడిగారు. ఇదే ప్రశ్న మహేష్ బాబును అడగగలరా” అంటూ కౌంటర్ వేశారు. అంతటితో ఆగకుండా.. మా అసోసియేషన్ లో కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం వచ్చింది. ఇదే విషయంపై తాజాగా నటి హేమ సోషల్ మీడియా వేదికంగా స్పందించారు. “మంచు లక్ష్మి పై మాట్లాడిన వాళ్ళు పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. గతం లో కూడా ఇలానే మహిళలపై మాట్లాడితే చర్యలు తీసుకోలేదు. దయచేసి మంచు విష్ణు మీరు వెంటనే రియాక్ట్ అవ్వాలి. అంటూ నటి హేమ చెప్పుకొచ్చారు. మరి ఈ వీడియోపై మా అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.