Aamir Khan: మహాభారతం సీరీర్ కోసం 30 ఏళ్ళ ప్రణాళిక.. అంతా సిద్ధంగా ఉండండి.. ఆమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

మహాభారతం.. భారత ఇతిహాసాలలో ఒకటైనా మహా గ్రంధం. దీనిని సినిమాగా(Aamir Khan) తెరకెక్కించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

Aamir Khan: మహాభారతం సీరీర్ కోసం 30 ఏళ్ళ ప్రణాళిక.. అంతా సిద్ధంగా ఉండండి.. ఆమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

Aamir Khan made interesting comments on the movie Mahabharata.

Updated On : September 20, 2025 / 5:04 PM IST

Aamir Khan: మహాభారతం.. భారత ఇతిహాసాలలో ఒకటైనా మహా గ్రంధం. దీనిని సినిమాగా తెరకెక్కించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రంధంపై చాలా సినిమాలే వచ్చాయి. అవన్నీ మహాభారతంలో ఎదో ఒక ఘట్టాన్నీ మాత్రమే తీసుకొని చేసినవి. కానీ, మహాభారతాన్ని పూర్తి కథగా సినిమా చేయాలని ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం మహాభారతం అనేది తన(Aamir Khan) డ్రీం ప్రాజెక్టు అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సైతం మహాభారతం చేయడం తన కలగా చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు కూడా మొదలుపెట్టారు.

Oscar 2026: ఆస్కార్ 2026 రేసులో కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం.. లిస్టు విడుదల చేసిన FFI

తాజాగా మరోసారి మహాభారతం సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆమిర్ ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “మహాభారతం సినిమాకి సంబంధించి మరో రెండు నెలల్లో స్క్రిప్ట్‌ పనులు మొదలవుతాయి. ఇది ఒక సినిమాలా కాకుండా యజ్ఞంలా పూర్తి చేయాలనుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రణాళిక చేసుకుంటున్నాను. ఇది నా జీవితంలోనే అతి ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్‌. ఇది పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. మీ అందరూ మెచ్చేలా చేయాలనుకుంటున్నా. ఈ అద్భుతం కోసం మీరంతా సిద్ధంగా ఉండాలి.

ఒకే భాగంలో చేయటం చాలా కష్టం. సిరీస్‌లా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. స్టోరీ పూర్తైన వెంటనే నటీనటుల ఎంపిక జరుగుతుంది”అంటూ చెప్పుకొచ్చారు ఆమిర్ ఖాన్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమిర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన నటించిన సితారే జమీన్ పర్ సినిమా విడుదల అయ్యింది. ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు ఆమిర్ ఖాన్.