Actress Hemalatha Reddy Wins Glammon's Mrs. India 2024 Award
Hemalatha Reddy : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత ‘నిన్ను చూస్తూ’ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన హేమలత రెడ్డి తాజాగా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు అందుకుంది. ఇదే ఈవెంట్ లో బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ అవార్డులు కూడా గెలుచుకుంది. గ్లామన్ మిసెస్ ఇండియా కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి మలేషియాలోని భారీ మురుగన్ విగ్రహం ఉండే ఆలయాన్ని సందర్శించారు.
Also Read : Janhvi Kapoor : అలాంటి పాత్రలు వచ్చినా చేయను.. ఆ విషయంలో అమ్మ మాటే నాకు వేదం..
అనంతరం గ్లామన్ మిసెస్ ఇండియా అవార్డు అందుకున్నందుకు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో హేమలత రెడ్డి మాట్లాడుతూ.. నేను ఎప్పట్నుంచో సినీ పరిశ్రమలో ఉన్నాను. జెమిని టీవీలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు చేశాను. కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ వచ్చాను. ఈ పేజెంట్ కు సెలెక్ట్ అయ్యి అన్ని రౌండ్స్ వర్చువల్ గా పూర్తిచేసి ఫైనల్ సెలక్షన్స్ కి మలేషియా వెళ్లాను. సౌత్ నుంచి నేనొక్కదాన్నే వెళ్లడం, గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలవడం సంతోషంగా ఉంది. మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నేను చేసిన సినిమాలో సుహాసిని గారితో నటించాను. ఆవిడ ఇచ్చిన టిప్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఇకపై ఫ్యాషన్ సైడ్, సినిమాల్లోనూ ముందుకు వెళ్తాను అని తెలిపింది.
ఇక గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా మాట్లాడుతూ.. గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా పోటీల కోసం 39 సిటీలలో 60 మంది కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి ఫైనల్ కి 35 మందిని మలేషియా తీసుకెళ్లాం. టైటిల్ విన్నర్ గా హైదరాబాద్ అమ్మాయి హేమలత రెడ్డి గెలిచారు. త్వరలో గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ చేస్తున్నాం. దీనికోసం 149 దేశాల నుంచి ఎంట్రీస్ తీసుకుంటున్నాం. ఆ ఫైనల్ ఈవెంట్ ప్యారిస్ లో ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.