Jaya Lakshmi : ఆ సీన్ చేయనందుకు మోహన్ బాబు నన్ను పంపించేశారు.. ఆ నటి కామెంట్స్ వైరల్

బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా నిరూపించుకుని వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి జయలక్ష్మి తాజాగా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Jaya Lakshmi

Jaya Lakshmi : సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చి చాలా గ్యాప్ తర్వాత యాంకర్‌గా మెరిశారు. వరుస సినిమా ఛాన్సులతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుకున్నారు. సహజ నటనతో ఆకట్టుకునే నటి జయలక్ష్మి తాజాగా మీడియాతో పలు అంశాలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

అప్పట్లో దూరదర్శన్‌లో వచ్చిన ‘హిమబిందు’ సీరియల్‌లో నటుడు అచ్యుత్ చెల్లెలి పాత్రలో కనిపించారు జయలక్ష్మి. ఆ తర్వాత స్క్రీన్ మీద అంతగా ఆసక్తి లేక పెళ్లి చేసుకుని బ్రేక్ తీసుకున్నారు. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక మళ్లీ బుల్లితెరపై కనిపించాలని ఆసక్తి కలిగింది. దాంతో యాంకర్‌గా కెరియర్ రీ స్టార్ట్ చేశారు. మొదట్లో వెదర్ రిపోర్టర్‌గా, మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో కనిపించిన జయలక్ష్మి తరువాత సీరియల్స్‌లో కనిపించారు. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్‌లో వచ్చిన ‘పిలిస్తే పలుకుతా’ సినిమా ఆఫర్‌తో బిగ్ స్క్రీన్‌పై బిజీ అయిపోయారు.  అప్పటి నుంచి అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలక్ష్మి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Bigg Boss Sivaji : బిగ్‌బాస్ శివాజీ కొడుకుని చూశారా? హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ పెద్ద కొడుకు..

సినిమా ఇండస్ట్రీలో సంతోషాన్ని పంచే అనుభవాలే కాదు చేదు అనుభవాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పారు జయలక్ష్మి. ఓసారి మేకప్ వేసుకుని షాట్ కి రెడీ అయిన సందర్భంలో కావాలని ఆ క్యారెక్టర్ నుంచి తనను తొలగించి వేరే వారికి ఆ ఛాన్స్ ఇచ్చి తనను ఇంటికి పంపించేశారని చెప్పారు. అవకాశం ఇచ్చినట్లు ఇచ్చి స్ట్రాంగ్ రీజన్ లేకుండా కేవలం ఈగో ప్రాబ్లంతో అలా చేశారని ఆ సంఘటన తనని చాలా బాధించిందని చెప్పారు జయలక్ష్మి.

నటుడు మోహన్ బాబు సినిమాలో పైట జార్చే సీన్‌లో నటించాల్సి వచ్చిందట జయలక్ష్మి. అందుకు డైరెక్టర్లకు ఆమె ససేమిరా అని చెప్పడంతో మోహన్ బాబు టవల్‌తో ఎలా నటించాలో చెప్పి ఆ సీన్‌ను మేనరిజంలాగ చేయాలని చెప్పారట. తను ఆ సీన్ తను చేయనని చెప్పేయడంతో తనని పంపించేసి వేరే ఆర్టిస్ట్‌ని పిలిపించమని మోహన్ బాబు చెప్పారట. వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాని మోహన్ బాబు ఇలాంటి సందర్భాల్లో విపరీతంగా కోపం తెచ్చుకుంటారట. అలాంటిది తనను సైలెంట్‌గా పంపించేయడం చూసి మూవీ టీం సైతం ఆశ్చర్యపోయారట. వ్యక్తులను బట్టి కూడా ఎదుటివారి ప్రవర్తన ఉంటుందని చెప్పారు జయలక్ష్మి.

Yatra 2 Movie : ‘యాత్ర 2’ సినిమాలో సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా జయలక్ష్మి మాట్లాడారు. ప్రతి రంగంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఏదైనా మన ప్రవర్తనని బట్టి ఉంటుందన్నారామె. తాను మూవీ ఛాన్స్‌ల కోసం ఎవరినీ అడగనని..కానీ అడగకపోవడం బిగ్ మిస్టేక్ అని తెలుసుకున్నానని.. అవకాశాల కోసం అడగడంలో ఏ తప్పు లేదని అన్నారు జయలక్ష్మి. నటనకు రిటైర్మెంట్ అంటూ ఉండదని ఓపిక ఉన్నంతకాలం.. అవకాశాలు వచ్చినంత కాలం చేస్తూ వెళ్లిపోవడమే అన్నారు జయలక్ష్మి.