Krithi Shetty : బాబోయ్.. కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్ చూశారా?

తాజాగా కృతిశెట్టి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది.

Actress Krithi Shetty shared her Belly Dance Video with Belly Dance Teacher

Krithi Shetty : తెలుగులో ‘ఉప్పెన’తో ఒక్కసారిగా దూసుకొచ్చి వరుస హిట్స్ కొట్టిన కృతిశెట్టి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ కూడా చూసింది. ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా కిందకి పడింది. ప్రస్తుతం ఆచితూచి అన్ని పరిశ్రమలలోని సినిమాలు చేస్తుంది. ఇప్పుడు కృతిశెట్టి చేతిలో తెలుగు, తమిళ్, మళయాళం.. మూడు భాషల్లో మూడు సినిమాలు ఉన్నాయి.

ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది కృతిశెట్టి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేసి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫుడ్, తిరుగుతున్న ప్రదేశాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో పోస్ట్ చేస్తుంది. తాజాగా కృతిశెట్టి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది.

Also Read : True Lover : ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ.. లవ్ ఫెయిల్యూర్స్, లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

తన బెల్లీ డ్యాన్స్ గురువు సంజనతో కలిసి బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ కి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియోని కృతి పోస్ట్ చేసింది. ఈ డ్యాన్స్ కృతినే స్వయంగా కంపోజ్ చేసినట్టు తెలిపింది. దీంతో కృతిశెట్టి అందంగా తన నడుము ఊపుతూ చేసిన ఈ బెల్లీ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఏం చేసిందబ్బా అని అభిమానులు, నెటిజన్లు కృతిని పొగిడేస్తున్నారు.