ఆయన్ని ఒక్కసారి కలవాలనుంది… మీరా మిథున్

  • Publish Date - March 14, 2020 / 08:00 AM IST

ఒక్క ఛాన్స్ ఇవ్వండి….ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి….. రియల్ గా ఆయన్ని కలవటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని  కోరుకుంటోంది….నటి మీరా మిథున్.  ఇంతకీ ఆమె ఎవరినీ కలవాలనుకుంటోందనుకుంటున్నారు….. వివాదాస్పద స్వామి నిత్యానందను. అవును మీరు విన్నది నిజమే. మహిళలను లైంగింకంగా వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని తప్పించుకు తిరుగుతున్న నిత్యానందను కలవాలనుకుంటోంది మోడల్, నటి  మీరామిథున్. కేసులు మీద కేసులు బుక్కయ్యేసరికి విదేశాలకు పారిపోయిన నిత్యానందను పట్టుకోటానికి  పోలీసులు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. కానీ పట్టుకోలేక పోయారు.

ఇంతకూ ఈ ముద్దుగుమ్మ నిత్యానందను ఎందుకు కలవాలనుకుంటోంది ? నిత్యానంద అపాయింట్ మెంట్ దొరుకుతుందా…. లేదో వేచి చూడాలి. మోడలింగ్ రంగంనుంచి సినిమా రంగానికి వచ్చిన ఈ భామ ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలోనూ పాల్గోని ప్రత్యేక గుర్తింపు పొందింది. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. పైగా మీరా మిథున్ పై పలు కేసులు కూడా ఉన్నాయి.  అయినా వాటినన్నింటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కోంటోంది.    

Also Read | కరోనా రూ.20లే రండి బాబూ..రండి!! వైరల్ వీడియో

గతంలో చెన్నై పోలీసులు అక్రమార్కులు, లంచగొండులూ అంటూ వ్యాఖ్యానించిన మీరా  లేటెస్ట్ గా ఒక వీడియోను  సోషల్ మీడియాలో విడుదల చేసింది.  అందులో అందులో నిత్యానందను ఒక్కసారి అయినా కలిసి ఆయనతో మాట్లాడాలన్నది తన కోరిక అని పేర్కొంది.

అంతే కాకుండా నిత్యానంద రాసిన ‘లివింగ్‌ ఎన్‌లైట్‌మెంట్‌’ అనే పుస్తకంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. మీరామిథున్‌ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు  సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.