Payal Ghosh : హీరోయిన్‌పై యాసిడ్ దాడి..

నటి పాయల్ ఘోష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ బాటిళ్లతో దాడి చేశారు..

Payal Ghosh : హీరోయిన్‌పై యాసిడ్ దాడి..

Payal Ghosh

Updated On : September 21, 2021 / 4:02 PM IST

Payal Ghosh: నటి పాయల్ ఘోష్ గాయాల పాలయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించగా ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఈ వార్త బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది..

అనురాగ్ కశ్యప్ నన్ను బలవంతం చేయబోయాడు-పాయల్ ఘోష్ షాకింగ్ కామెంట్స్..

ఈ సంఘటన గురించి పాయల్ చెబుతూ.. ‘మెడిసిన్స్ తీసుకుందామని చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లాను. వర్క్ ఫినిష్ చేసుకుని కారెక్కుతుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి నాపై దాడి చేశారు.. అప్పుడే చేతికి గాయాలయ్యాయి. వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి.

Radhika Sarathkumar : వెంకీ మామతో లంచ్ అండ్ లాఫ్..

దీంతో ఒక్కసారిగా భయంతో హెల్ప్ చెయ్యడంటూ గట్టిగా అరిచాను.. దాంతో వాళ్లు అక్కడినుంచి పారిపోయారు. ఆ దుర్ఘటన ఇంకా నా కళ్ల ముందే కదులుతుంది.. తలుచుకుంటుంటే కాంగారుగా ఉంది.. నాపై దాడికి యత్నించిన వారిపై కంప్లైంట్ చేశాను. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’ అని చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Payal Ghosh (@iampayalghosh)