అనురాగ్ కశ్యప్ నన్ను బలవంతం చేయబోయాడు-పాయల్ ఘోష్ షాకింగ్ కామెంట్స్..

  • Published By: sekhar ,Published On : September 19, 2020 / 04:13 PM IST
అనురాగ్ కశ్యప్ నన్ను బలవంతం చేయబోయాడు-పాయల్ ఘోష్ షాకింగ్ కామెంట్స్..

Payal Ghosh Sensetional Comments on Anurag Kashyap: తనపట్ల ఓ దర్శకుడు అనుచితంగా ప్రవర్తించాడనే విషయాన్ని ఇటీవల వెల్లడించిన నటి పాయల్‌ ఘోష్ దర్శకుడి పేరు చెప్పలేదు. ఇప్పుడు తనను బలవంతం చేయబోయింది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నన్ను ఇబ్బంది పెట్టిన దర్శకుడెవరో కాదు.. అనురాగ్‌ కశ్యప్‌. అయితే ఇప్పుడు ఆయన స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను చూస్తుంటే నవ్వొస్తుంది. నేను కలవడానికి వెళ్లినప్పుడు ఆయన మద్యం తాగుతున్నాడు. రణబీర్‌ కపూర్‌ సినిమాలో కనీసం ఒక సీన్‌లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోవాలనుకుంటారన్నాడు. సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదన్నట్లు నాతో మాట్లాడాడు.


హ్యుమా ఖురేషి, రిచా చద్దా, మహిగిల్ వంటి హీరోయిన్స్‌ నాకు ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటారని, నేనెప్పుడు పిలిచినా వచ్చి, నేనేం చేయమంటే అది చేస్తారని చెప్పారు. నేను కూడా వారిలాగానే చేస్తానని అనుకున్నాడు. మాట్లాడుతుండగానే నన్ను బలవంతం చేయబోయాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. నేను అన్‌కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను, శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేనని, తర్వాత కలుస్తానని చెప్పి వచ్చేశాను.


ఆ సమయంలోనే నేను బయటకు చెబుదామంటే నన్ను చాలా మంది వద్దని భయపెట్టారు. అలాగే ఇతర ఆర్టిస్టులను వారెంత బాధపెట్టారనే విషయాన్ని కూడా చెప్పారు. ఒక అమ్మాయి డైరెక్టర్‌ని సినిమా అవకాశం కోసం వచ్చి కలవొచ్చు. అంతమాత్రాన ఆమె వేశ్య కాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పాయల్‌ ఘోష్‌..