Actress Poorna : మగ బిడ్డకి జన్మనిచ్చిన నటి పూర్ణ..

యాక్ట్రెస్ పూర్ణ గత ఏడాది డిసెంబర్ నెలలో తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు (ఏప్రిల్ 4) ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Actress Poorna gave birth to baby boy - Pic Source Instagram

Actress Poorna : రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును (Avunu) సినిమాలో నటించి తెలుగులో ఫేమ్ ని సంపాదించుకున్న నటి ‘పూర్ణ’ (Poorna). ఈ యాక్ట్రెస్ గత ఏడాది అక్టోబర్ లో సీక్రెట్ వివాహం చేసుకుంది. కేరళకు వ్యక్తి అయిన శనిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లాడింది. ఇతను దుబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తగా పేరుని సంపాదించుకున్నాడు. ఇక పెళ్లి విషయాన్ని అభిమానులకు కొన్ని రోజులు తరువాత తెలియజేసిన పూర్ణ.. పెళ్లి అయిన రెండు నెలలకే డిసెంబర్ లో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించడం విశేషం.

Nani Dasara : తెలుగు ఇండియన్ ఐడల్‌లో ధరణి ధూమ్ ధామ్ సందడి..

ఇక అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ లోనే ఉంటున్న పూర్ణ.. అక్కడే ఘనంగా సీమంతం కూడా చేసుకుంది. తాజాగా నేడు (ఏప్రిల్ 4) ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. దుబాయ్ హాస్పిటల్ బిడ్డకి జన్మినిచ్చిన తరువాత అక్కడి డాక్టర్స్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది పూర్ణ. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Nagarjuna : టాలెంట్ ఉందా.. అయితే నాగార్జునకి వాట్సాప్ చేయండి..

అమ్మగా మారిన పూర్ణ.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా? లేదా మళ్ళీ తిరిగి వస్తుందా? అనేది తెలియదు. ఇటీవల రిలీజ్ అయిన నాని దసరా (Dasara) సినిమాలో పూర్ణ కూడా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.