Nani Dasara : తెలుగు ఇండియన్ ఐడల్‌లో ధరణి ధూమ్ ధామ్ సందడి..
నేచురల్ స్టార్ నాని (Nani) దసరా (Dasara) సినిమాతో థియేటర్ లో సందడి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆహాలో కూడా ఎంట్రీ ధూమ్ ధామ్ సందడి షురూ చేస్తా అంటున్నాడు.

Nani came as Guest into Aha Telugu Indian Idol for Dasara promotions
Nani Dasara : నేచురల్ స్టార్ నాని (Nani) పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేసిన సినిమా ‘దసరా’ (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించగా, దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) ఒక ముఖ్య పాత్రలో నటించాడు. మార్చి 30న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి ఆడియన్స్ నుంచే కాకుండా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, సుకుమార్ వంటి స్టార్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Nagarjuna : టాలెంట్ ఉందా.. అయితే నాగార్జునకి వాట్సాప్ చేయండి..
సక్సెస్ టాక్ తో దూసుకు పోతున్నా నాని మాత్రం మూవీ ప్రమోషన్స్ లో ఏమాత్రం వేగం తగ్గించడం లేదు. తాజాగా తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కి (Indian Idol) గెస్ట్ గా వెళ్లి సందడి చేశాడు. ఇటీవలే గ్రాండ్ గా మొదలైన ఇండియన్ ఐడల్ సీజన్ 2 మంచి ప్రజాధారణతో ముందుకు వెళుతుంది. ఇక ఈ వారం ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా వచ్చాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ఏప్రిల్ 7,8 తేదీల్లో రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. ఈ వారం ఇండియన్ ఐడల్ లో ధరణి ధూమ్ ధామ్ సందడి చూసి ఎంజాయ్ చేసేయండి.
War 2 : వార్ 2 అనౌన్స్ చేసిన హృతిక్.. టైగర్‌తో స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ షురూ..
కాగా బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 5 రోజుల్లో 92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 45 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి కూడా అడుగు పెట్టనుంది. కొత్త దర్శకుడు అయినా శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏప్రిల్ 5న కరీంనగర్ లోని SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరగనుంది.
View this post on Instagram