Actress Pragathi has started training for the next tournament.
Actress Pragathi: టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మొదట హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించింది. అయితే, కేవలం నటన మాత్రమే కాదు ఆమె కల వేరే ఉంది. ఆ కల కోసం అహర్నిశలు కష్టపడింది. ఇటీవల విజయం కూడా సాధించింది. నటి ప్రగతి తన సోషల్ మీడియాలో జిమ్ సూట్ వేసుకొని వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. వాటిపై చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేశారు. ఈ వయసులో నీకు ఇలాంటివి అవసరమా అంటూ ట్రోల్ కూడా చేశారు.
Regina Cassandra: చీరలో అందాల రచ్చ చేస్తున్న రెజీనా.. ఫోటోలు
కానీ, ప్రగతి(Actress Pragathi) అవేమి పట్టించుకోలేదు. చాలా కష్టపడి రీసెంట్ గా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించింది. ఇది చూసి చాలా మంది అవాక్కయ్యారు. ఎవరైతే ట్రోల్ చేశారో ఇప్పుడు వాళ్లే ఆమెను పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్, వీడియోస్ చేస్తున్నారు. ఏదైనా సాధించాలి అనే తపన ఉంటే చాలు.. దానికి వయసుతో సంబందం లేదు అని మరోసారి ప్రూవ్ చేసింది. దీంతో ఇప్పుడు నటి ప్రగతి పేరు నేషనల్ లెవల్లో వైరల్ గా మారింది.
ఇక తన నెక్స్ట్ టార్గెట్ ని కూడా ఇప్పుడే ఫిక్స్ చేసుకుంది. త్వరలో జరుగబోయే మరో టోర్నమెంట్ కోసమ్ ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేసింది. అందుకోసం జిమ్ లో కష్టపడుతోంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని పథకాలు గెలువాలనే సంకల్పంతోనే ఆమె ముందుకు సాగుతోంది. మరోపక్క సినిమా అవాకాశాలను కూడా ఆమె సద్వినియోగం చేసుకుంటున్నారు. ఓపక్క సినిమాలు, మరోపక్క తన కల కోసం సాధన రెండిటినీ అద్భుతంగా బ్యాలన్స్ చేస్తున్నారు ప్రగతి. ఈ విషయంలో యువతకు సైతం ఆమె ఆదర్శంగా నిలిచారు అనే చెప్పాలి. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఆమె సాధించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.