Rakul Preet Singh : నా పేరును వాడుకోవ‌డం మానేయండి.. ర‌కుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్‌..

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.

Actress Rakul Preet Singh Reacts On Konda Surekha Comments

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ త‌న‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. త‌న‌ పేరుని తప్పుడు ఆరోపణలతో మీ రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయాల‌ని కోరింది.

” తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత, వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నాది గొప్ప ప్ర‌యాణం. ఇప్పటికీ ఈ ఇండస్ట్రీతో చాలా కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పరిశ్రమలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు ప్రచారం చేయడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనసు విరిచేసేలా ఉంది.

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా

గౌరవం కోసం, మనం మౌనంగా ఉండటాన్ని ఎంచుకుంటాము. కానీ అది మన బలహీనతగా తప్పుగా భావిస్తున్నారు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ వ్యక్తి/ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును ఇలా హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మానేయండి. ఆర్టిస్టులను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి. రాజకీయ విమర్శలు, న్యూస్ హెడ్ లైన్స్ కోసం అర్థంలేని కథలలో మా పేర్లు వాడుకోవడం మానేయండి.” అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.