కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా

కొండా సురేఖ తమ కుటుంబ పరువుప్రతిష్ఠలను దెబ్బతీశారని..

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా

Updated On : October 3, 2024 / 6:05 PM IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువునష్టం, క్రిమినల్ కేసులు వేశారు. కొండా సురేఖ తమ కుటుంబ పరువుప్రతిష్ఠలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

మరోవైపు, వరంగల్ లో అక్కినేని అభిమానుల నిరసనలు చేపట్టారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాపయ్యపేట చమన్ లో నిరసనకు దిగారు. కొండా సురేఖ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నాగార్జున అభిమానులు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు, మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు కోరారు. కొండా సురేఖ ఆరోపణలు వెనక్కి తీసుకుని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడికి యత్నం