Rakul Preet Singh : మేకప్ లేకుండా రకుల్‌ని ఎప్పుడైనా చూసారా? నో మేకప్ అంటూ ఫోటో పోస్ట్..

కొందరు నటీనటులు మేకప్ లేకపోతే గుర్తు పట్టలేం. కానీ హీరోయిన్ రకుల్ మేకప్ లేకుండా మరింత అందంగా ఉన్నారు. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rakul Preet Singh : మేకప్ లేకుండా రకుల్‌ని ఎప్పుడైనా చూసారా? నో మేకప్ అంటూ ఫోటో పోస్ట్..

Rakul Preet Singh

Updated On : January 17, 2024 / 1:37 PM IST

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ లేటెస్ట్‌గా మేకప్ లేని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. మేకప్ లేకుండానే రకుల్ బాగున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Rakul Preet Singh

Rakul Preet Singh

‘గిల్లీ’ అనే కన్నడ సినిమాతో 2009 లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, పండగ చేస్కో, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో, స్పైడర్ వంటి సినిమాల్లో నటించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి టాప్ హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం తెలుగులో కనిపించట్లేదు. ఆఫర్లు రాకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మేకప్ లేని ఫోటోలను షేర్ చేసారు. ‘నో ఫిల్టర్.. నో మేకప్’ అంటూ రకుల్ షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. మేకప్ లేకుండానే రకుల్ అందంగా ఉన్నారంటూ ప్రశంసలు కురిపించారు.

Sapthami Gowda : మోడ్రన్ క్యూట్ లుక్స్‌తో.. కాంతార భామ సప్తమి గౌడ..

మరోవైపు ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న రకుల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్వరలో తన పెళ్లి విషయంలో ప్రకటన చేస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి శివకార్తికేయన్‌తో రకుల్ నటించిన కోలీవుడ్ మూవీ ‘అయలాన్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి కాబోతోంది. ఇండియన్ 2 లో కూడా రకుల్ నటిస్తున్నారు.