×
Ad

Saanve Megghana : అక్క హీరోయిన్ – తమ్ముడు హీరో.. ఇద్దరూ హిట్స్ కొట్టి.. వీళ్ళ గురించి తెలుసా..?

ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అవుతున్నారు ఈ అక్కాతమ్ముడు.(Saanve Megghana)

Saanve Megghana

Saanve Megghana : సినిమా ఫ్యామిలీల నుంచి చాలా మంది మళ్ళీ సినీ పరిశ్రమలోకి వస్తారు. అక్క తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు హీరో హీరోయిన్స్ గా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. రకుల్ ప్రీత్ – అమన్, నిహారిక – వరుణ్ తేజ్.. బాలీవుడ్ లో కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అవుతున్నారు ఈ అక్కాతమ్ముడు.(Saanve Megghana)

తెలుగమ్మాయి, హీరోయిన్ శాన్వి మేఘన ఎప్పుడో 2019 లోనే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పిట్ట కథలు, పుష్పక విమానం, ప్రేమ విమానం, టుక్ టుక్, కుడుంబస్థాన్.. సినిమాలతో మంచి విజయాలే అందుకుంది. తమిళ్ లో కుడుంబస్థాన్ సినిమా అయితే భారీ విజయం సాధించింది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది శాన్వి.

Also Read : Ariyana Glory : అమర్ దీప్ వల్లే నా మతం మారింది.. పళని సుబ్రహ్మణ్య స్వామి నా జీవితాన్ని మార్చేశాడు..

తాజాగా శాన్వి మేఘన తన బ్రదర్ హీరోగా మొదటి సినిమా రిలీజయింది అంటూ ఆనందంలో పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే వంశీ పూజిత్. ఇటీవల క్రిస్మస్ కి పతంగ్ అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. అందరూ కొత్తవాళ్లతో, గాలి పటాల ఫైటింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో లవ్ కామెడీ జానర్లో తెరకెక్కిన పతంగ్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాలో వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ హీరోలుగా నటించారు. వంశీ గతంలో బ్లాక్ కాఫీ అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించి అవార్డులు కూడా అందుకున్నాడు. MBA పూర్తిచేసి సినిమాల్లోకి వచ్చాడు.

ఓ పక్క అక్క శాన్వి మేఘన హీరోయిన్ గా మంచి విజయాలు సాధించి అవకాశాలు తెచ్చుకుంటుంటే ఇప్పుడు తమ్ముడు వంశీ పూజిత్ కూడా హీరోగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. మొత్తానికి ఈ అక్కాతమ్ముళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

Also Read : Nilakanta : ‘నీలకంఠ’ ట్రైలర్ రిలీజ్.. రీ ఎంట్రీ ఇస్తున్న స్నేహ ఉల్లాల్..