sandalwood Drug case: చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ ఎపిసోడ్ నడుస్తోంది. Bollywood, Tollywood, sandalwood దాకా డ్రగ్ డోసే బర్నింగ్ టాపిక్. అందుకే కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ డ్రగ్ బగ్స్ బయటపడ్డాయ్. మొదట Ragini Dwivediతో మొదలై.. ఇప్పుడు Actress Sanjana Galraniకూడా ఈ లిస్టులోకి వచ్చేసింది. విచారణలో వీళ్లిద్దరూ చెబుతున్న పేర్లు కన్నడ ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయ్.
బాలీవుడ్‌లో రియా చక్రవర్తి డ్రగ్స్ లింకులతో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. కర్ణాటక చిత్ర పరిశ్రమలో కూడా డ్రగ్స్ లింకులు బయటపడటంతో అందరి ఫోకస్ ఇటు కూడా మళ్లింది. కొత్తగా బయటపడ్డ ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు
Kannada film industryని కుదిపిస్తోంది. విచారణలో కొందరు కన్నడ నటీనటుల పేర్లు లైమ్ లైట్‌లోకి రావడం కలకలం రేపుతోంది.
డ్రగ్స్ కేసులో సినీ నటి రాగిణి పేరు వెలుగులోకి రావడం సెగలు రేపింది. మరికొందరు ఇండస్ట్రీ ప్రముఖులకు కూడా సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ అరెస్టయ్యారు. విచారణలో వాళ్లిద్దరూ కొత్తవాళ్ల పేర్లు చెప్పారు.
డ్రగ్స్ వ్యవహారాలతో, కన్నడ చిత్రపరిశ్రమలోని మరికొందరు సినీనటులు, సంగీత కళాకారులకు సంబంధాలున్నాయని చెప్పినట్లు సమాచారం.
రాగిణి, సంజన డ్రగ్స్ తీసుకుంటున్నారా? లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు ఆ ఇద్దరి నుంచి బ్లడ్, హెయిర్ శాంపిల్స్ సేకరించారు డాక్టర్లు. కనీసం 3 నెలల కింద డ్రగ్స్ వాడినా టెస్టుల్లో తేలిపోతుందని చెబుతున్నారు. ఐతే ఈ టెస్టులకు సంజన, రాగిణి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వైద్యసిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవపడినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ ఇద్దరు హీరోయిన్ల ఆస్తులపై సీసీబీ అధికారులు దృష్టి పెట్టారు. తనకు బెంగళూరులో పది ప్లాట్లు ఉన్నట్లు సంజన చెప్పడంతో అధికారులు షాక్ తిన్నారు. డ్రగ్స్ సప్లై ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలించారన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.
డ్రగ్స్ కేసులో రాగిణి, సంజనను సీసీబీ అధికారులు విచారించారు. మందు పార్టీలు, శ్రీలంక టూర్లు, డ్రగ్స్ వినియోగంపై ప్రశ్నలు సంధించారు. తమకేం తెలియదని.. అనవసరంగా ఈ కేసులో ఇరికించారని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇదే కేసులో కీలక నిందితుడు, మంగళూరుకు చెందిన ప్రతీక్ శెట్టిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వ ఆచూకీ ఇంకా తెలియలేదు.
కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇంద్రజీత్ లంకేశ్, డ్రగ్స్‌తో సంబంధం ఉన్న కొందరు స్టార్స్ పేర్లను బయటపెట్టారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లు అధికారులకు ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది.
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మరో ఇద్దరు ఫేమస్ హీరోయిన్లు కూడా డ్రగ్స్ లిస్టులో ఉన్నారన్న విషయం కూడా కలకలం రేపుతోంది. కొందరు పొలిటీషియన్లు, వారి కుమారులు, ఇంకొందరు కోటీశ్వరుల పిల్లల పేర్లు ఇలా కర్ణాటక డ్రగ్స్ కేసులో లింక్స్ పెరుగుతూ పోతున్నాయ్.