షకీలా.. అందుకే సినిమాల్లోకి వచ్చారంట!

Actress Shakeela biopic – Richa Chadda: బాలీవుడ్‌లో మలయాళ నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ బయోపిక్ తెరకెక్కింది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ బయోపిక్‌లో నటి రిచా చడ్డా షకీలా టైటిల్ రోల్ పోషించారు. క్రిస్మస్ సందర్భంగా షకీలా మూవీ రిలీజ్ అయింది. సినీ ఇండస్ట్రీలో షకీలా మూవీలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.. షకీలా సినిమా కలెక్షన్లు భారీగా ఉండేవి.. షకీలా కోసమే సినిమాలు ఎక్కువ చూసేవారు.. షకీలా సినిమా ఉందంటే చాలు.. బడా హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్ డేట్లు మార్చుకునేవారంట.. అంతటి క్రేజ్ సంపాదించిన షకీలా సినిమా తెర వెనుక ఆమె వ్యక్తిగత జీవితం దయానీయంగా ఉండేది. షకీలా తల్లి జూనియర్ ఆర్టిస్ట్.. ఆర్థిక ఇబ్బందులతోనే షకీలా తన జీవితాన్ని నెట్టుకొచ్చారు.

కుటుంబ భారం తనపై పడటంతో తప్పని పరిస్థితుల్లో షకీలా నటిగా మారారు. ఆర్థికంగా నిలబడేందుకు మాత్రమే షకీలా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారని టైటిల్ రోల్ పోషిస్తున్న రిచా చడ్డా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మలయాళ పరిశ్రమలో షకీలాను అతిపెద్ద స్టార్ చేసిన మూవీల జాబితాను రిచా చడ్డా సేకరించారు. షకీలా నటించిన అన్ని మూవీలను చూసినట్టు రిచా చెప్పుకొచ్చారు.

వాస్తవానికి మూవీల్లో షకీలా న‌టించాల‌ని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. కేవ‌లం డ‌బ్బు కోసం మాత్రమే షకీలా సినిమాల్లో న‌టించార‌ని రిచా తెలిపారు. ష‌కీలాగా తెరపై కనిపించేందుకు బరువు పెరగాల్సి వచ్చింద‌ని రిచా అన్నారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులే ఆమెను సినిమాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయని, అది కూడా కుటుంబ సభ్యుల బలవంతంపైనే ఆమె నటనవైపు వచ్చారని రిచా చెప్పుకొచ్చారు.