Shanthi Priya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లి.. భర్త చనిపోయాక.. ఇలా గుండు కొట్టించుకొని..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ చెల్లి శాంతి ప్రియ కొంతమందికి గుర్తే ఉంటుంది.

Actress Shanthi Priya Shares Photos with Bald Head
Shanthi Priya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ చెల్లి శాంతి ప్రియ కొంతమందికి గుర్తే ఉంటుంది. తెలుగులో మహర్షి, కలియుగ అభిమన్యుడు, సింహ స్వప్నం.. లాంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శాంతిప్రియ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్‌రాయ్‌ను శాంతిప్రియ 1999లో పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమాలకు దూరమైంది.
అయితే ఇటీవల సిద్దార్థ రాయ్ 2004లో గుండెపోటుతో మరణించారు. తన భర్త చనిపోయే ముందే శాంతిప్రియ టీవీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్, టీవీ షోలు చేస్తుంది. భర్త చనిపోవడంతో తీవ్ర బాధ అనుభవించిన శాంతిప్రియ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. శాంతిప్రియ గుండు గీయించుకొని ఒక బ్లేజర్ వేసుకొని హాట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి సంచలనంగా మారాయి.
Also Read : Rajamouli : ‘ది అకాడమీ’ అలా అనౌన్స్ చేయగానే రాజమౌళి.. ఆస్కార్ అవార్డు కోసం..
శాంతిప్రియ ఈ ఫోటోలను పోస్ట్ చేసి.. ఇటీవలే నేను గుండు గీయించుకున్నాను. ఒక కొత్త అనుభూతిని పొందుతున్నాను. మహిళగా మనం సమాజంలోని కట్టుబాట్లు, నియమ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనమే కట్టడి చేసుకుంటున్నాం. నేను ఇలా చేసి అలాంటి వాటి నుంచి విముక్తి పొందాను. ప్రపంచం మనపై విధించిన అందం ప్రమాణాలను నాశనం చేయాలనే ఇలా చేశాను. ధైర్యం, నమ్మకంతోనే ఇలా చేసాను. నా భర్త బ్లేజర్ ని నేను వేసుకొని ఆయన ఇంకా నా వద్దే ఉన్నారని ఫీల్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేసింది. దీంతో శాంతిప్రియ పోస్ట్ వైరల్ అవ్వగా పలువురు ఆమెని అభినందిస్తుంటే పలువురు నెటిజన్లు మాత్రం విమర్శిస్తున్నారు.