Rajamouli : ‘ది అకాడమీ’ అలా అనౌన్స్ చేయగానే రాజమౌళి.. ఆస్కార్ అవార్డు కోసం..

RRR సినిమాలోని సాంగ్ కి బెస్ట్ సాంగ్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Rajamouli : ‘ది అకాడమీ’ అలా అనౌన్స్ చేయగానే రాజమౌళి.. ఆస్కార్ అవార్డు కోసం..

Rajamouli Planning Mahesh Babu Movie with Target Oscar after Academy Announce Interesting Thing

Updated On : April 11, 2025 / 2:58 PM IST

Rajamouli : రాజమౌళి ఇండియన్ సినిమాని హాలీవుడ్ వరకు తీసుకెళ్లి, RRR సినిమాలోని సాంగ్ కి బెస్ట్ సాంగ్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కలలో కూడా ఊహించని ఆస్కార్ తెలుగు సినిమాలోని సాంగ్ కి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. రాజమౌళి పేరు, RRR సినిమా పేరు ప్రపంచమంతా వినిపించింది. దాంతో రాజమౌళి మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమాని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసి పాన్ వరల్డ్ రిలీజ్ చేయబోతున్నారు.

అయితే తాజాగా ది అకాడమీ సంస్థ 2028 నుంచి స్టంట్ డిజైన్ విభాగంలో కూడా ఆస్కార్ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంటే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కి, ఫైట్ మాస్టర్స్ కి కూడా ఆస్కార్ అవార్డు రానుంది. 2027 లో రిలీజయ్యే సినిమాల నుంచి ఈ అవార్డు మొదలుపెట్టనున్నారు. అకాడమీ సంస్థ దీనికి సంబంధించిన అధికారిక పోస్ట్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో RRR సినిమాలోని యాక్షన్ సీన్ ని కూడా జత చేసారు.

Also Read : Akkada Ammayi Ikkada Abbayi : ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ మూవీ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ హీరోగా రెండో సినిమా ఎలా ఉందంటే..?

దీంతో రాజమౌళి స్పందిస్తూ.. స్టంట్ మాస్టర్స్ కి అవార్డు విభాగం ఏర్పాటు చేసినందుకు, అధికారిక పోస్టర్ లో RRR యాక్షన్ సీన్ వాడినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఆస్కార్ ఈ విభాగంలో అవార్డు అనౌన్స్ చేయడంతో రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ఆస్కార్ టార్గెట్ పెట్టుకున్నారు అని సమాచారం. RRR యాక్షన్ సీన్స్ కి హాలీవుడ్ మొత్తం నివ్వెరపోయింది. ముఖ్యంగా RRR ఇంటర్వెల్ ఫైట్ చూసి హాలీవుడ్ దిగ్గజాలు సైతం పొగిడారు. అప్పుడే స్టంట్ విభాగంలో అవార్డు ఉంటే కచ్చితంగా RRR కి వచ్చేదని రాజమౌళి కూడా భావించారట.

ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. మహేష్ సినిమాలో కూడా కొత్తగా భారీ యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేయనున్నాడు రాజమౌళి. రాజమౌళి సినిమాల్లో ఫైట్స్ కొత్తగా, భారీగా ఉంటాయని తెలిసిందే. అందుకే మహేష్ బాబు సినిమాలో యాక్షన్ సీన్స్ తో ఎలాగైనా ఆస్కార్ అవార్డు సాధించాలని ఫిక్స్ అయ్యారట రాజమౌళి. అందుకే అకాడమీ రూల్స్ ప్రకారం మహేష్ సినిమాని ముందే కాకుండా 2027 లోనే రిలీజ్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు అని తెలుస్తుంది.

Also Read : Pawan Kalyan : 15 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు.. అయినా సరే పక్కన పెట్టేసాను..

ఇదే కనక నిజమయి రాజమౌళి – మహేష్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే రాజమౌళి రేంజ్ తో పాటు టాలీవుడ్ రేంజ్ ఆకాశాన్ని అంటుంటుంది. మరి రెండో సారి ఆస్కార్ అవార్డు రాజమౌళి తెప్పిస్తారా? తెచ్చి చరిత్ర సృష్టిస్తారా తెలియాలంటే 2028 వరకు ఆగాల్సిందే.