Pawan Kalyan : 15 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు.. అయినా సరే పక్కన పెట్టేసాను..

బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Pawan Kalyan : 15 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు.. అయినా సరే పక్కన పెట్టేసాను..

Bommarillu Bhaskar says he already tells a Story to Pawan Kalyan

Updated On : April 11, 2025 / 7:37 AM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న మెయిన్ రెండు సినిమాలకే డేట్స్ ఇవ్వడానికి కుదరట్లేదు. అయినా సినిమాలు చేస్తాను డబ్బుల కోసం అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే చాలా మంది దర్శకులు కథలు పట్టుకొని రెడీగా ఉన్నారు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ గతంలో పవన్ కళ్యాణ్ కి ఓ కథ చెప్పాను అని ఆసక్తికర విషయం తెలిపారు.

బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భాస్కర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు.

Also Read : OG : వామ్మో.. OG సినిమా ఓటీటీ హక్కులు అన్ని కోట్లా? ఇది OG సినిమా మీదున్న హైప్ అంటే..

బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. నా కెరీర్ బెస్ట్ సినిమా ఇంకా తీయలేదు. ఆ సినిమా చేయాలని ఉంది నాకు. ఆరెంజ్ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఆ కథ చెప్పాను. అది తీస్తే బెస్ట్ సినిమా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఇలా కూడా కథలు రాస్తారా అన్నారు. డిఫరెంట్ గా బాగుంది అన్నారు. అయినా నేనే ఆ కథని పక్కన పెట్టేసాను. ఆ కథ పూర్తి చేయాలంటే అప్పుడు నేను ఇంకా చాలా లైఫ్ చూడాలి అనిపించింది. ఆ అనుభవాలు కథకు పనికొస్తాయి అనిపించింది. ఇన్నాళ్లకు ఆ కథకు కావాల్సిన అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు కథ పూర్తిగా రెడీ అయింది అని అన్నారు.

మరి ఇప్పుడు ఆ కథని మళ్ళీ పవన్ కళ్యాణ్ కి చెప్తారా? లేదా వేరే హీరోతో చేస్తారా చూడాలి. 15 ఏళ్ళ క్రితమే పవన్ కళ్యాణ్ కథ విని బాగుంది అన్నారు కానీ ఆ కథ ఇప్పటి ట్రెండ్ కి సరిపోతుందా కూడా చూడాలి. పవన్ ఎలాగో ఇంకా సినిమాలు చేస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు మళ్ళీ కథ చెప్పి ఛాన్స్ పట్టే అవకాశం కూడా ఉండొచ్చు.

Also Read : Good Bad Ugly Review : అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కి మాత్రం పండగే..