Shobha Shetty
Shobha Shetty : నటి శోభాశెట్టి అనేకంటే ‘కార్తీక దీపం’ మోనిత అంటే అందరూ ఈజీగా గుర్తు పట్టేస్తారు. తెలుగు బిగ్ బాస్ 7 సీజన్ లో అలరించిన ఈ నటిని ‘రాష్ట్రీయ గౌరవ్’ అవార్డు వరించింది. అవార్డు వచ్చిన సంబరాన్ని శోభా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Venky75 : వెంకీ మామ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్‌కి.. ఆ ముగ్గురు హీరోలతో పాటు చిన్నోడు కూడా..
కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. లేడీ విలన్‌గా తిరుగులేని నటన ప్రదర్శించారు శోభా శెట్టి. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ 7 కి ఎంట్రీ ఇచ్చారు. సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో ఎంతగా అలరించారో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అంతే నెగెటివిటీ సంపాదించుకున్నారు శోభా శెట్టి. 5 వారాలకే హౌస్ నుండి వెళ్లిపోతుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేసారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ శోభా శెట్టి 14 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగారు. టాప్ 7 కంటెస్టెంట్‌గా నిలిచిన ఈ భామ బిగ్ బాస్ సీజన్ పూర్తై బయటకు వచ్చారో లేదో రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది.
కార్తీక దీపం సీరియల్‌లో విలన్ పాత్రకు గాను శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి చేతుల మీదుగా శోభా శెట్టి అ వార్డు అందుకున్నారు. ఈ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు శోభా శెట్టి. ‘కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రకు రాష్ట్రీయ గౌరవ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. నా జర్నీలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ అనే శీర్షికతో తను అందుకున్న అవార్డుతో ఫోటో పోస్టు చేశారు శోభా శెట్టి.