Venky75 : వెంకీ మామ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్‌కి.. ఆ ముగ్గురు హీరోలతో పాటు చిన్నోడు కూడా..

వెంకీ మామ 75 ఫిలిమ్స్ విక్టరీ సెలబ్రేషన్స్‌కి చిరు, బాలయ్య, నాగ్ రాబోతున్నారట. అలాగే వెంకటేష్ ఆన్ స్క్రీన్ తమ్ముడు..

Venky75 : వెంకీ మామ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్‌కి.. ఆ ముగ్గురు హీరోలతో పాటు చిన్నోడు కూడా..

Tollywood star heroes for Venkatesh 75th movie Saindhav celebrations

Updated On : December 27, 2023 / 2:50 PM IST

Venky75 : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన కెరీర్ 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన ల్యాండ్ మార్క్ మూవీగా ‘సైంధవ్‌’ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇక 75 ఫిలిమ్స్ కంప్లీట్ చేసుకున్న వెంకటేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు.

సెలబ్రేటింగ్ వెంకీ 75 పేరిట తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని విధంగా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈరోజు డిసెంబర్ 27న హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈ విక్టరీ సెలబ్రేషన్స్ ని నిర్వహించబోతున్నారు. కాగా ఈ ఈవెంట్ కి ఆ ముగ్గురు స్టార్ హీరోలు రాబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ కి ఉన్న నాలుగు పెద్ద పిల్లర్స్ అంటే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.

Also read : Guntur Kaaram : పోస్టర్స్‌తోనే అదరగొట్టేస్తున్న మహేష్ బాబు.. ‘గుంటూరు కారం’లో ‘రమణ గాడి మాస్ జాతర’ చూడాల్సిందే..

వెండితెర పై ఎంత పోటీ పడినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఈ నలుగురు చాలా స్నేహంగా ఉంటారు. ఇప్పుడు ఆ స్నేహంతోనే చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ 75 సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా వస్తున్నారట. వీరితో పాటు వెంకటేష్ ఆన్ స్క్రీన్ తమ్ముడు మహేష్ బాబు కూడా రాబోతున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యేవరకు వేచి చూడాలి.

ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ ఈవెంట్ మొదలు కాబోతుంది. ఇక సైంధవ్‌ విషయానికి వస్తే.. హిట్ సినిమా ఫేం శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

వెంకటేష్ నుంచి ఇలాంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అవుతుంది. దీంతో వెంకీ మామ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చుస్తునారు. జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్ర చేస్తున్నారు. తమిళ్ హీరో ఆర్య ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.