Guntur Kaaram : పోస్టర్స్‌తోనే అదరగొట్టేస్తున్న మహేష్ బాబు.. ‘గుంటూరు కారం’లో ‘రమణ గాడి మాస్ జాతర’ చూడాల్సిందే..
గుంటూరు కారం నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్, రెండు పాటలు రిలీజయి మంచి అంచనాలే క్రియేట్ చేసినా పోస్టర్స్ తో మాత్రం సినిమాపై బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు.

Mahesh Babu Trivikram Guntur Kaaram Movie Creates Buzz with Posters
Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) మూడోసారి సినిమా అనౌన్స్ చేయగానే అభిమానులు, సినిమా లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. దీంతో వీరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ టైటిల్ ప్రకటించగానే ఈసారి బాబుని ఫుల్ మాస్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది.
గుంటూరు కారం నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్, రెండు పాటలు రిలీజయి మంచి అంచనాలే క్రియేట్ చేసినా పోస్టర్స్ తో మాత్రం సినిమాపై బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికే గుంటూరు కారం నుంచి బోలెడన్ని పోస్టర్స్ వదిలారు. వాటిల్లో ఎక్కువగా మహేష్ స్టైల్ గా బీడీ పట్టుకొని మాస్ గా కనిపించాడు.
ఇక కొన్ని పోస్టర్స్ తో అయితే క్యూట్ గా స్మైల్ ఇస్తూ క్లాస్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. దీంతో గుంటూరు కారం అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఇప్పటికే శ్రీలీలతో ఉన్న ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీలీల మరింత అందంగా కనిపించి మెప్పిస్తుంది. అలాగే శ్రీలీలతో ఓ మాస్ సాంగ్ కూడా ఉన్నట్టు చిత్రయూనిట్ ప్రకటించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ టైటిల్ సాంగ్ దమ్ మసాలా.. అదిరిపోయింది.
ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పండక్కి ఫ్యామిలీలతో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేసేయొచ్చు. గుంటూరు కారం కలెక్షన్స్ ఘాటు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తుంది అని అభిమానులు అంటున్నారు.
కుదిరినప్పుడల్లా ఇలా గుంటూరు కారం పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు చిత్రయూనిట్.