Actress Sreeleela Wants to do Tamil Movies after watching Tamil People Love
Sreeleela : శ్రీలీల ఒక్కసారిగా టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చి ధమాకాతో దుమ్ము దులిపేసింది. దీంతో కుర్రాళ్ళ ఫాలోయింగ్ తో పాటు అభిమానుల్ని సంపాదించుకుంది. తన డ్యాన్స్ లతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల. ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో వచ్చి హిట్ కొట్టింది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. శ్రీలీల కన్నడ, తెలుగులో సినిమాలు చేసింది. తాజాగా తమిళ్ లో కూడా చేస్తా అంటుంది. శ్రీలీలకు సోషల్ మీడియాలో, బయట అభిమానులు చాలానే ఉన్నారు. తెలుగు, కన్నడలోనే కాక బయట కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవల శ్రీలీల చెన్నై దగ్గర్లోని ఓ మెడికల్ కాలేజీ కల్చరల్ ఈవెంట్ కి వెళ్ళింది. అక్కడి స్టూడెంట్స్ శ్రీలీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. శ్రీలీల కోసం అరుపులు, విజిల్స్ తో హడావుడి చేసారు. దీంతో శ్రీలీల కూడా ఆశ్చర్యపోయింది. శ్రీలీల పేరు, ఫోటోలు పట్టుకొని జనాల మధ్యలో నుంచి చూపించారు. ఇవన్నీ చూసి తమిళనాడులో కూడా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని షాక్ అయింది శ్రీలీల.
Also Read : Manjummel Boys : మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
దీంతో స్టేజిపై శ్రీలీల మాట్లాడుతూ.. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్లు నాకో డౌట్ ఉండేది. నాకు తమిళ్ రాదు, తమిళ్ లో సినిమాలు చేయలేదు. ఇక్కడ నేనెవరికీ తెలుస్తాను అనుకున్నాను. నన్ను గెస్ట్ గా పిలిచినప్పుడు నేనెలా వస్తాను అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ప్రేమ చూసాక చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని చూసాక ఇక్కడికి వచ్చి తమిళ్ సినిమా చేయాలి అనిపిస్తుంది. మెడికల్ కాలేజీలో ఇంత ఎనర్జీనా? నేను కూడా మెడికల్ స్టూడెంట్ నే. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి తమిళ్ లో చేయడానికి నేను రెడీ అని శ్రీలీలే స్వయంగా చెప్పింది, ఇది విని ఎవరైనా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.
SreeLeela | Tamil | ?
— Christopher Kanagaraj (@Chrissuccess) March 26, 2024