Manjummel Boys : మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులోకి రాబోతుంది.

Manjummel Boys : మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

Malayalam Super Hit Movie Manjummel Boys Ready to Releasing in Telugu

Updated On : March 26, 2024 / 7:17 PM IST

Manjummel Boys : ఇటీవల మలయాళం సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో అన్ని సినిమా పరిశ్రమ వాళ్ళు మలయాళ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేయించి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి.

ఇటీవలే మలయాళం సూపర్ హిట్ సినిమాలు భ్రమయుగం, ప్రేమలు(Premalu) సినిమాలు డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాయి. భ్రమయుగం తెలుగులో పర్వాలేదనిపించినా ప్రేమలు సినిమా మాత్రం భారీ విజయం సాధించింది. ఒక డబ్బింగ్ మలయాళం సినిమా ఏకంగా 15 కోట్లు తెలుగులో కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ప్రేమలు సినిమా తెలుగులో కూడా రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులోకి రాబోతుంది.

Also Read : Ram Charan : కొడుకు బర్త్‌డే సందర్భంగా.. 500 మందికి అన్నదానం చేసిన రామ్‌చరణ్ తల్లి..

మంజుమ్మల్ బాయ్స్ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 22న రిలీజయింది. కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఓ గుహలోకి ప్రవేశం లేకపోయినా వెళ్తారు. ఆ గుహ లోపల ఓ లోయలో ఒక ఫ్రెండ్ పడిపోతే మిగిలిన వాళ్లంతా అతన్ని ఎలా బయటకు తీశారు అనే థ్రిల్లర్, ఫ్రెండ్షిప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కగా ఇప్పటికే ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి మళయాళంలోనే ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డ్ సెట్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో ఏప్రిల్ 6న రిలీజ్ కాబోతుంది. ఇక్కడి సినిమా ప్రేమికులు కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి తెలుగులో మంజుమ్మల్ బాయ్స్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాని చిదంబరం దర్శకత్వంలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు.. పలువురు మలయాళ యువ నటులతో చిత్రీకరించారు.