Actress Sudha : విజయ్ ఆంటోనీ కూతురి మరణంపై సీనియర్ నటి సుధ వ్యాఖ్యలు.. ఎప్పుడూ పిల్లల గురించే మాట్లాడేవాడు..

సీనియర్ నటి సుధ విజయ్ ఆంటోనీ కూతురి మరణంపై మాట్లాడుతూ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి స్పందించింది.

Actress Sudha reacts on Vijay Antony Daughter Issue

Actress Sudha :  నిన్న ఉదయం తమిళ్ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ(Vijay Antony) కూతురు లారా(Laura) ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తమిళ సినీ ప్రముఖులు, విజయ్ అభిమానులు, నెటిజన్లు విజయ్ కూతురు లారాకి నివాళులు అర్పిస్తూ ఆయనకి ధైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

తాజాగా పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన సీనియర్ నటి సుధ విజయ్ ఆంటోనీ కూతురి మరణంపై మాట్లాడుతూ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి స్పందించింది.

Also Read : Vijay Antony Daughter : బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. 16 ఏళ్ళ వయసులో..

సుధ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ చాలా మంచి మనిషి. ముందు రోజు వరకు కూడా ఆయనతో షూటింగ్ లోనే ఉన్నాను. గత పది రోజులుగా ఆయన సినిమాలో నటిస్తున్నాను. ఇలాంటి విషాదం ఆయన కుటుంబంలో జరుగుతుందని అస్సలు ఊహించలేదు. విజయ్ తల్లిగా నటిస్తున్న నాకే ఇంత బాధగా ఉంటే ఆ పాప కన్నతల్లి ఇంకెంత బాధపడుతుందో. మేం నటించేటప్పుడు మాతో ఎప్పుడు మాట్లాడినా తన పిల్లల ప్రస్తావన తెచ్చేవాడు. తన పిల్లల గురించే మాట్లాడేవాడు విజయ్. ఆయన చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. కిందపడి మళ్ళీ పైకి లేస్తాం.తల్లితండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోవాలి. ఆ బాధ నుంచి విజయ్ కుటుంబం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.