Surekha Vani : సీక్రెట్‌గా సెకండ్ మ్యారేజ్?
పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

Surekha Vani
Surekha Vani: తెలుగుతో పాటు తమిళ్‌లోనూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది సురేఖా వాణి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుందామె. తన కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే వీడియోలు ఓ రేంజ్‌లో హల్ చల్ చేస్తుంటాయి.
View this post on Instagram
గతకొద్ది రోజులుగా నెట్టింట రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకటి.. సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది.. రెండు.. ఆమె కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది అని.. అయితే తనకు రెండో పెళ్లి ఆలోచన లేదని ఆ వారత్లన్నీ అవాస్తవమని చెప్పింది సురేఖ.
View this post on Instagram
కట్ చేస్తే ఇప్పుడామె సీక్రెట్‌గా సెకండ్ మ్యారేజ్ చేసుకుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త నిజమే అనుకునేలా మెడలో తాళిబొట్టుతో కనిపించింది సురేఖా వాణి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఓ పిక్‌లో ఆమె మెడలో మంగళసూత్రం ధరించి ఉంది.
View this post on Instagram
మరో వీడియోలోనూ తాళిబొట్టుతో దర్శనమిచ్చింది. దీంతో సురేఖ సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసేసుకుందని కొందరు, కాదు.. షూటింగ్‌లో భాగంగా మెడలో తాళిబొట్టు వేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా స్వయంగా సురేఖా వాణి క్లారిటీ ఇస్తేనే కానీ నెటిజన్లు ఆగేలా లేరు.
View this post on Instagram