Vishika : మొగుడ్ని కాలితో తంతే గాల్లోకి.. ఇటీవలే నవ్వించిన నటి ఇప్పుడు హీరోయిన్ గా..

తాజాగా ఈ సినిమా నుంచి విషిక పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు. (Vishika)

Vishika : మొగుడ్ని కాలితో తంతే గాల్లోకి.. ఇటీవలే నవ్వించిన నటి ఇప్పుడు హీరోయిన్ గా..

Vishika

Updated On : January 5, 2026 / 8:23 PM IST

Vishika : బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. పవన్ కళ్యాణ్‌ బత్తుల ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విషిక, హాసిని సుధీర్‌, వైష్ణవి కొక్కుర హీరోయిన్స్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్.. పలువురు కమెడియన్స్ కూడా ఉన్నారు.(Vishika)

ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ చెప్తూ హీరోలు, హీరోయిన్స్ కి సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి విషిక పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు. ఇటీవల కోర్ట్ సినిమాలో సీరియస్ పాత్రలో, పతంగ్ సినిమాలో ఫుల్ కామెడీతో నవ్వించిన విషిక ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్సులు అందుకుంటుంది. ఈ సినిమాలో విషిక హీరోయిన్ గా కనిపించనుంది.

Also See : Ram Charan : బేబీ బంప్ తో ఉపాసన.. చరణ్ ఇంట్లో బిర్యానీ పండగ.. ఫొటోలు వైరల్..

ఈ సినిమాలో విషిక పాత్ర పూర్తి రెబల్‌గా ఉంటుందని రిలీజ్ చేసిన పోస్టర్ తో అర్థం అవుతోంది. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా కనిపిస్తోంది. విషిక చేతిలో కసిరెడ్డి రాజ్ కుమార్‌ నలిగిపోయే భర్తలా నటించబోతున్నట్టు తెలుస్తుంది. కాలితో తంతే.. గాల్లోకి ఎగిరాడు అన్నట్టు విషిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దీంతో విషిక పోస్టర్ వైరల్ గా మారింది.

Actress Vishika First Poster Released from Purushaha Movie

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Also Read : Koragajja : రీల్స్ చేయండి.. ఏకంగా కోటి రూపాయల వరకు బహుమతులు గెలుచుకోండి.. కన్నడ సినిమా క్రేజీ ఆఫర్..