లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు కొందరు సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌లు విసురుతున్నారు. కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, అధ్యాయన్ సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సమన్ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వీరి బ్రేకప్ సమయంలో ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇటీవల మొరదాబాద్ ఘటనపై కంగనా సోదరి రంగోలీ చందేల్ చేసిన వివాదస్పద ట్వీట్ కారణంగా ఆమె ట్విట్టర్ ఖాతా తొలగించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దీనిపై బాలీవుడ్ నటులు పలు రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో పలు సందర్భాల్లో కంగనా, సుమన్ బ్రేకప్ విషయం కూడా మరోసారి వార్తల్లోకెక్కింది. కంగనా కారణంగా సుమన్, స్టార్ హీరో హృతిక్ రోషన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారికి మద్దతుగా టీవీ నటి కవిత కౌషిక్ ట్వీట్ చేసింది.