Manoj Muntashir : ‘ఆదిపురుష్’ డైలాగ్స్ వివాదం.. డైలాగ్స్ మారుస్తాం అంటూ ఎట్టకేలకు స్పందించిన రచయిత..

ట్రోలింగ్, దేశవ్యాప్తంగా విమర్శలు ఎక్కువవడంతో ఆదిపురుష్ చిత్రయూనిట్ దిగి వచ్చి కొన్ని డైలాగ్స్ ని మార్చడానికి ఓకే చెప్పింది. అయితే దీనిని కూడా తనకు సపోర్ట్ గా మార్చుకుంటూ తన తప్పేమి లేదంటూనే డైలాగ్స్ మారుస్తామంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

Adipurush dialogues will change said by writer manoj muntashir

Adipurush :  ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) మెయిన్ లీడ్స్ లో రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ నిన్న జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటించాడు. అయితే ముందు నుంచి ఈ సినిమాని రామాయణం అంటూ ప్రమోట్ చేశారు. కానీ సినిమాలో రామాయణం ఛాయలు కనపడకపోవడంతో నెటిజన్లు, అభిమానులు, ప్రేక్షకులు ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ ఓం రౌత్ పై దారుణమైన విమర్శలు, ట్రోల్స్ చేశారు.

ఇక ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ కూడా తప్పుగా ఉన్నాయంటూ, రామాయణంలోని పాత్రల స్వరూపాలు మాత్రమే కాదు డైలాగ్స్, విజువల్స్ అన్ని కూడా మార్చేశారని సోషల్ మీడియా వేదికగా ఆదిపురుష్ యూనిట్ పై, రచయిత పై ఫైర్ అవుతున్నారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్ పై పెద్ద వివాదమే చెలరేగుతుంది. పలువురు రాజకీయ నాయకులు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. అయితే నిన్నటివరకు ఈ డైలాగ్స్ ని ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్ల సమర్ధించుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అయితే అసలు ఇది రామాయణమే కాదు అనేశాడు. దీంతో మనోజ్ పై నిన్నటి నుంచి ట్రోలింగ్ ఎక్కువైంది.

ఇక ట్రోలింగ్, దేశవ్యాప్తంగా విమర్శలు ఎక్కువవడంతో ఆదిపురుష్ చిత్రయూనిట్ దిగి వచ్చి కొన్ని డైలాగ్స్ ని మార్చడానికి ఓకే చెప్పింది. అయితే దీనిని కూడా తనకు సపోర్ట్ గా మార్చుకుంటూ తన తప్పేమి లేదంటూనే డైలాగ్స్ మారుస్తామంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ తన ట్వీట్ లో.. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించాలని రామాయణం చెప్తుంది. ఆదిపురుష్ లో నేను 4000 లైన్లకు పైగా డైలాగ్స్ రాశాను. కేవలం 5 లైన్స్ లో మాత్రం మీ సెంటిమెంట్లు దెబ్బ తిన్నాయి. కానీ శ్రీరాముడు గురించి, సీత గురించి సినిమా అంతా నేను రాసిన దానికి మాత్రం ప్రశంసలు రాలేదు. నా సొంత వాళ్ళే నాపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో రాశారు. మూడు గంటల సినిమాలో మూడు నిముషాలు మీకు నచ్చనట్టు రాశాను. దీంతో నన్ను సనాతన ద్రోహి అన్నారు. మీరు ఎందుకు తొందర పడ్డారో తెలీదు. ఇదే సినిమాలో రాముడి కోసం గొప్ప పాటలు రాశాను. మనం ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడితే సనాతన వ్యవస్థ నష్టపోతుంది. సనాతన సేవ కోసమే ఆదిపురుష్ ని సృష్టించాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు, భవిష్యత్తులో కూడా చూస్తారని అనుకుంటున్నాను. నా డైలాగ్స్ కి సపోర్ట్ గా నేను ఎన్ని వాదనలు అయినా ఇవ్వగలను కానీ అది మీ బాధ తగ్గించిందని అర్థమైంది. అందుకో మిమ్మల్ని బాధించే కొన్ని డైలాగ్స్ ని రివైజ్ చేద్దామని నేను, డైరెక్టర్, చిత్రయూనిట్ నిర్ణయించాము. త్వరలో ఆ డైలాగ్స్ ని మార్చి ఈ వారంలోనే సినిమాలో అవి చేరుస్తాము అని తెలిపారు.

Thalapathy Vijay : 10 గంటలు పైగా స్టేజిపై నించొని.. 1000 మందికి పైగా స్టూడెంట్స్ కి సన్మానం చేసి.. వైరల్ అవుతున్న తలపతి విజయ్..

అయితే ఇప్పటికి కూడా తప్పు ఒప్పుకోకుండా, క్షమాపణలు అడగకుండా ఇలా మీరు అడిగారు కాబట్టే డైలాగ్స్ మారుస్తున్నాము, నా డైలాగ్స్ కి నేను సపోర్ట్ చేసుకోగలను అంటూ ట్వీట్ చేయడంతో మరోసారి మనోజ్ పై తప్పు చేశామని భావన లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. అంతే కాకా మొన్నటిదాకా రామాయణం అని, నిన్న రామాయణం కాదు అని, మళ్ళీ ఇవాళ రామాయణం డైలాగ్స్ మారుస్తామని ఇలా రోజుకొక మాట చెప్తుండటంతో పలువురు చిత్రయూనిట్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ ఆదిపురుష్ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.