Adipurush : హమ్మయ్య.. నేపాల్‌లో ఆదిపురుష్ ఒక్కటే బ్యాన్.. మిగిలిన హిందీ సినిమాలకు ఓకే..

నేపాల్ రాజధాని ఖాట్మండుతో పాటు పలు నగరాల్లో ఆదిపురుష్ సినిమాతో పాటు హిందీ సినిమాలన్నీ బ్యాన్ చేశారు. దీనిపై నేపాల్ డిస్ట్రిబ్యూటర్స్ కోర్టుకి వెళ్లగా ఒక్కసారి సెన్సార్ అయిన సినిమాని అడ్డుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

Adipurush movie ban in nepal lift ban on Hindi Movies

Nepal :  ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి వివాదాల్లోనే నిలుస్తుంది. డైలాగ్స్, రామాయణం పాత్రలు, రైటర్ కామెంట్స్.. ఇలా అనేక విషయాల్లో ఆదిపురుష్ వివాదంలో నిలిచింది. ఇండియాలో ఈ సినిమాని బ్యాన్ చేయాలని పలువురు కోరుతున్నారు. నేపాల్ లో అయితే ఇప్పటికే పలు నగరాల్లో ఆదిపురుష్ సినిమాని బ్యాన్ చేశారు.

సీతాదేవి అప్పటి నేపాల్ లో జన్మించడంతో నేపాల్ లో ఆమెకు భక్తులు ఎక్కువ. అయితే ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిని భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా చూపించడం, డైలాగ్స్ కూడా అలాగే ఉండటంతో నేపాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై అక్కడ వివాదం చెలరేగగా ఆ డైలాగ్స్ మార్చాలని చిత్రయూనిట్ ని నేపాల్ అధికారులు కోరినా స్పందించకపోవడంతో నేపాల్ రాజధాని ఖాట్మండుతో పాటు పలు నగరాల్లో ఆదిపురుష్ సినిమాతో పాటు హిందీ సినిమాలన్నీ బ్యాన్ చేశారు.

అయితే దీనిపై నేపాల్ డిస్ట్రిబ్యూటర్స్ కోర్టుకి వెళ్లగా ఒక్కసారి సెన్సార్ అయిన సినిమాని అడ్డుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయినా నేపాల్ అధికారులు కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోలేదు. దీంతో అధికారులతో నేపాల్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ చర్చలు జరిపింది. ఈ చర్చల అనంతరం హిందీ సినిమాలకు అనుమతి ఇచ్చి ఒక్క ఆదిపురుష్ సినిమాపై మాత్రం బ్యాన్ కంటిన్యూ చేస్తున్నారు.

Vyooham Teaser : ఆర్జీవీ వ్యూహం టీజర్ రిలీజ్.. జగన్ కోసం ఆర్జీవీ చేసిన వ్యూహం చూశారా?

దీంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. నేపాల్ లో హిందీ సినిమాలు రెగ్యులర్ గా విడుదల అవుతాయి. అక్కడ హిందీ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఆదిపురుష్ దెబ్బతో నేపాల్ లో హిందీ సినిమాలన్నీ బ్యాన్ చేయడంతో కొంతమంది కంగారు పడ్డారు. ఇప్పుడు హిందీ సినిమాలపై బ్యాన్ ఎత్తివేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేపాల్ లో ఆదిపురుష్ బ్యాన్ చేసినా చిత్రయూనిట్ స్పందించకపోవటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు