Adipurush: ఎట్టకేలకు ఓవర్సీస్ డీల్ ముగించుకున్న ఆదిపురుష్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Adipurush: ఎట్టకేలకు ఓవర్సీస్ డీల్ ముగించుకున్న ఆదిపురుష్..!

Adipurush Movie Completes Overseas Deal

Updated On : April 18, 2023 / 11:19 AM IST

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ నుంచి హనుమంతుడి స్పెషల్ పోస్టర్.. రిలీజ్ డేట్ మార్చేదే లేదు..

అయితే, ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి పెద్దఎత్తున విమర్శలు రావడంతో, ఈ మూవీకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులను మరింత నాణ్యతగా మలిచేందుకు చిత్ర యూనిట్ సమయం తీసుకుంది. ఇక ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెత్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ గతకొంత కాలంగా ఫైనల్ కాలేదు. దీంతో ఈ సినిమాను ఓవర్సీస్‌లో ఎవరు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఇప్పుడు ఆదిపురుష్ ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ రేటుకు వారు ఆదిపురుష్ ఓవర్సీస్ రైట్స్‌ను దక్కించుకున్నారట.

Adipurush : ఆదిపురుష్ పండగ స్పెషల్ పోస్టర్.. ఈ సారి కూడా ట్రోల్స్ తప్పలేదుగా..

ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.