Adipurush : ఆదిపురుష్ నుంచి హనుమంతుడి స్పెషల్ పోస్టర్.. రిలీజ్ డేట్ మార్చేదే లేదు..
మొదట 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఈ విమర్శలు చూసి మరింత గ్రాఫిక్ వర్క్స్ చేయాలని సినిమాని 16 జూన్ 2023కి వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.

Adipurush Hanuman Poster (Photo : Instagram)
Adipurush : ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. కానీ టీజర్ రిలీజ్ తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శించారు. ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేశారు.
మొదట 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఈ విమర్శలు చూసి మరింత గ్రాఫిక్ వర్క్స్ చేయాలని సినిమాని 16 జూన్ 2023కి వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. ఇటీవల శ్రీరామనవమికి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ ఏమన్నా మారుతుందా, మళ్ళీ వాయిదా పడుతుందా అని అంతా భావించారు.
Also Read : Dasara Movie : 100 కోట్ల దసరా.. నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ సినిమా..
తాజాగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ తో పాటు జై శ్రీరామ్ అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా ప్లే చేస్తూ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు. దీంతో పాటే ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023 రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులని తన గ్రాఫిక్స్ తో మెప్పిస్తాడా చూడాలి.
View this post on Instagram