Dasara Movie : 100 కోట్ల దసరా.. నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ సినిమా..

నాని ఓ కొత్త డైరెక్టర్ తో 100 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించడంతో నాని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.

Dasara Movie : 100 కోట్ల దసరా.. నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ సినిమా..

Nani Dasara Movie collects 100 crores gross collections in just a week

Updated On : April 6, 2023 / 10:50 AM IST

Dasara Movie :  నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో వచ్చిన దసరా(Dasara) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్(Block Buster) గా నిలిపాయి. ఇక కలెక్షన్స్ లో కూడా దసరా సినిమా దూసుకుపోతుంది.

దసరా సినిమా మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా సాధించి నాని కెరీర్ లో అత్యంత వేగంగా 50 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో నాని కచ్చితంగా 100 కోట్లు చాలా ఫాస్ట్ గా సాధిస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే నాని దసరా సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మార్చ్ 30న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఏప్రిల్ 5 నాటికి దసరా సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Image

దీంతో నాని కెరీర్ లో దసరా రెండో 100 కోట్ల సినిమాగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా 125 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు రాజమౌళి బ్రాండ్ లేకుండా నాని ఓ కొత్త డైరెక్టర్ తో 100 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించడంతో నాని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. దీనిపై నాని, చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా గ్రాండ్ గా బుధవారం నాడు కరీంనగర్ లో నిర్వహించారు. అటు అమెరికాలో కూడా 2 మిలియన్ డాలర్స్ సాధించి నాని కెరీర్ లో అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన మొదటి సినిమాగా నిలిచింది దసరా.

Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..

దసరా సినిమా 100 కోట్లు సాధించడంతో ప్రభాస్ స్పెషల్ విషెష్ తెలుపుతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. అభిమానులు, పలువురు ప్రముఖులు కూడా నానికి, చిత్రయూనిట్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.