Adipurush Pre Release event in Tirupati so many Special Programs
Adipurush Pre Release Event : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎప్పటికి గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తిరుపతిలో నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన వేద గురువు చినజీయర్ స్వామి రానున్నారు.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సెట్ ని కూడా అయోధ్య లాగా కనపడేలా భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ మరియు రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ కి హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సినిమాలో నటించే తేజ యాంకరింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరో యాంకర్ గా ఝాన్సీ హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా భారీగా అభిమానులు, ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంత సిద్ధం చేశారు. ప్రభాస్ కూడా తిరుపతి చేరుకున్నారు. చిత్రయూనిట్ నేడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది.