Aditi Rao Hydari : సిద్దార్థ్ నాకు ఆ స్కూల్‌లో ప్రపోజ్ చేసాడు.. మా పెళ్లి ఆ గుడిలోనే జరుగుతుంది..
తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి రావు తమ ప్రేమ గురించి పలు విషయాలు తెలిపింది.

Aditi Rao Hydari talk about his love and Marriage and Proposal of Siddharth
Aditi Rao Hydari – Siddharth : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని ఇటీవల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ముంబైలో ఎక్కడికి వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి రావు తమ ప్రేమ గురించి పలు విషయాలు తెలిపింది.
అదిరిరావు హైదరి మాట్లాడుతూ.. సిద్దార్థ్ నాకు మహాసముద్రం షూటింగ్ సమయంలోనే పరిచయమయ్యాడు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాము. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది. నా చిన్నప్పుడు ఎక్కువగా ఆ స్కూల్ లోనే గడిపేదాన్ని. నాకు ఆ ప్లేస్ అంటే ఇష్టం. ఈ విషయం సిద్దార్థ్ కి తెలుసు. ఓ రోజు సిద్దార్థ్ నన్ను ఆ స్కూల్ కి త్రీసుకెళ్ళమని అడగడంతో తీసుకువెళ్లాను. ఆ స్కూల్ లో సిద్దార్థ్ నాకు ప్రపోజ్ చేసాడు. మా నానమ్మ చనిపోయింది. ఆమె ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు. అతను తన ప్రేమని చెప్పిన విధానం నాకు నచ్చింది అని తెలిపింది.
Also Read : Tollywood – Samantha : టాలీవుడ్‌లో కూడా హేమ కమిటీ.. ? సమంతతో పాటు టాలీవుడ్ మహిళా ప్రముఖులు విజ్ఞప్తి..
అలాగే తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా ఫ్యామిలీకి చాలా స్పెషల్. మా ఎంగేజ్మెంట్ అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక మేమే అందరికి చెప్తాము అని తెలిపింది అదితి రావు హైదరి.