Aditi Shankar Entry in Telugu with Bhairavam Movie Interesting Comments on Manchu Manoj
Manchu Manoj – Aditi Shankar : గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు మనోజ్. మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో భైరవం అనే సినిమా మే 30 రాబోతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కు జంటగా అదితి నటిస్తుంది.
ఇప్పటికే హీరోయిన్ గా, సింగర్ గా అదితి తమిళ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు అదితి శంకర్ తెలుగులో భైరవం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా నేడు అదితి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ లో మనోజ్ అందరికంటే ముందే తనకు తెలుసు అని చెప్పింది.
Also See : Adivi Sesh – Nani : నానితో అడివి శేష్.. హిట్ 3 వర్కింగ్ స్టిల్స్..
మనోజ్ ప్రస్తావన రాగా.. మనోజ్ అన్న చెన్నైలో నేను చదువుకునేటప్పుడు మా ఇంటిపక్కనే ఉండేవాళ్ళు. నాకు మనోజ్ అన్న అప్పట్నుంచే తెలుసు. సెట్ లో మేమిద్దరం మొదటిసారి ఎదురవ్వగానే మచ్చా.. నువ్వు ఏంటి ఇక్కడ అని అడిగాడు. నేను కూడా అన్న నువ్వు ఏంటి ఇక్కడ అని అడిగాను. ఇద్దరం ఈ సినిమాలో కలిసి నటిస్తున్నామని తెలిసి ఆశ్చర్యపోయాము. మనోజ్ అన్న సెట్ లో బిర్యానీ వండి పెట్టాడు. నారా రోహిత్ గారు కూడా మటన్ వండి పెట్టారు. నాకు వంట వచ్చు కానీ నాకు వండే ఛాన్స్ ఇవ్వలేదు. నన్ను సెట్ లో బాగా చూసుకున్నారు. అన్ని నా దగ్గరికే వచ్చేవి. మనోజ్ అన్న తెలుసు, సెట్ లో చాలా మంది తమిళ్ మాట్లాడారు దాంతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అని తెలిపింది.
దీంతో అదితి శంకర్, మంచు మనోజ్ చెన్నై నుంచి పరిచయం అని, మనోజ్ అదితిని మచ్చా అని పిలిస్తే అదితి మనోజ్ ని అన్నా అని పిలుస్తుందని తెలుస్తుంది.