Akkineni Nagarjuna : హీరో నాగార్జున పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

Adjournment of hearing on Hero Nagarjunas petition

Akkineni Nagarjuna – Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. గురువారం నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. నాగార్జున పిటిష‌న్ పై శుక్ర‌వారం న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టాల్సి ఉండ‌గా వాయిదా ప‌డింది. న్యాయ‌మూర్తి సెల‌వులో ఉండ‌డంతో విచార‌ణ సోమ‌వారానికి వాయిదా ప‌డింది. నాగార్జున పిటిష‌న్ పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.

ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్ప‌టికే టాలీవుడ్‌లోని స్టార్ హీరోల నుంచి చిన్న ఆర్టిస్టుల వ‌ర‌కు మంత్రి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. తాజాగా నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Bigg Boss 8 : మిడ్‌వీక్ ఎలిమినేష‌న్‌.. ఊహించ‌ని ట్విస్ట్‌.. వెళ్ల‌నంటూ ఏడ్చిన నైనిక‌

కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని మండిప‌డ్డారు. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని అన్నారు. కుటుంబ స‌భ్యుడిగా, సినీ వ‌ర్గాల్లో స‌భ్యుడిగా తాను మౌనంగా ఉండ‌న‌ని అన్నాడు. ఇది ఎంత మాత్రం క్ష‌మించ‌రానిద‌ని అన్నారు.