Bigg Boss 8 : మిడ్‌వీక్ ఎలిమినేషన్.. ఊహించని ట్విస్ట్.. వెళ్లనంటూ ఏడ్చిన నైనిక
నాగ్ చెప్పినట్లుగా గురువారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ జరిగింది.

Bigg Boss 8 Midweek Elimination Aditya Om Gets Evicted
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో వారం కొనసాగుతోంది. ఊహించని ట్విస్ట్‌లతో సాగుతోంది. 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లగా.. తొలివారం బేబక్క, రెండో వారం శేఖర్ భాష, మూడో వారం అభయ్, నాలుగో వారం సోనియాలు ఎలిమినేట్ కావడంతో 10 మంది హౌస్‌లో ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని గత ఆదివారం నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక నాగ్ చెప్పినట్లుగా గురువారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించివేశారు. మెగా చీఫ్ టాస్క్ పూర్తి అయిన తరువాత సుమారు 11 గంటల సమంలో హౌస్‌లోని లైట్స్ బ్లింక్స్ అవుతూ సైరన్స్ మోగాయి. దీంతో ఏం జరుగుతోందని కంటెస్టెంట్స్ కాస్త కంగారు పడ్డారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీస్ అయి ఉంటుందని పృథ్వీ అన్నాడు.
Kali Movie : ‘కలి’ మూవీ రివ్యూ.. కలిపురుషుడు వచ్చి..
కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాలో వచ్చి నిలబడమని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ రాత్రి ఒకరికి పీడకలగా మారనుందని, మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఇప్పుడు జరగనుందని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న నిఖిల్, నబీల్, విష్ణు ప్రియ, మణికంఠ, నైనిక, ఆదిత్య ఓంలు ఉన్నారని బిగ్‌బాస్ చెప్పారు. వీరిలో నిఖిల్, నబీల్, మణికంఠకు మంచి ఓట్లు పడడంతో వారు సేవ్ అయ్యారని వెల్లడించారు.
ఇక మిగిలిన ముగ్గురిని లగేజ్ సర్దుకోమ్మని బిగ్‌బాస్ ఆదేశించాడు. తనకు వెళ్లాలని లేదంటూ నైనిక ఏడవగా సీత, ప్రేరణ, నిఖిల్‌లు ఓదార్చారు. డేంజర్ జోన్‌లో ఉన్న ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్‌మేట్స్‌కు అప్పగించాడు బిగ్‌బాస్. నిఖిల్, మణికంఠ, యష్మీ, సీత లు ఆదిత్య ఓంను ఒకడుగు ముందుకు తీసుకువెళ్లి తమ రీజన్స్ చెప్పారు. పృథ్వీ, ప్రేరణలు నైనికను, విష్ణు ప్రియను నబీల్ ముందుకు తీసుకువెళ్లారు. అందరి కంటే ఎక్కువ ఓట్లు పడడంతో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో ఆదిత్య ఓం హౌస్‌ను వీడాడు.
Chitti Potti : ‘చిట్టిపొట్టి’ మూవీ రివ్యూ.. సిస్టర్ సెంటిమెంట్‌తో..