Chitti Potti : ‘చిట్టిపొట్టి’ మూవీ రివ్యూ.. సిస్టర్ సెంటిమెంట్‌తో..

చిట్టి పొట్టి సినిమా పూర్తిగా చెల్లి సెంటిమెంట్ తో పాటు బంధువులంతా ఉండాలి అనే ఓ పాయింట్ తో తెరకెక్కించారు.

Chitti Potti : ‘చిట్టిపొట్టి’ మూవీ రివ్యూ.. సిస్టర్ సెంటిమెంట్‌తో..

Sister Sentiment Chitti Potti Movie Review

Updated On : October 4, 2024 / 6:40 AM IST

Chitti Potti Movie Review : రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చిట్టి పొట్టి’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చెల్లెలు సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. కిట్టు(రామ్ మిట్టకంటి) పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కిట్టు చెల్లి చిట్టి(పవిత్ర) అంటే అతనికి చాలా ఇష్టం. ఆమె జోలికి ఎవరు వచ్చినా, ఎవరైనా ఆమెని ఏడిపించినా ఊరుకోడు. కిట్టు తండ్రి సైడ్ బంధువులకు దూరంగా ఉంటారు. కిట్టు గర్ల్ ఫ్రెండ్ (కస్వి) అమెరికాలో ఉంటుంది. ఓ రోజు కొంతమంది ఆకతాయి బ్యాచ్ తన చెల్లి ఫోటోలను డీప్ ఫేక్ మార్ఫింగ్ చేస్తారు. దీంతో చిట్టి ఆత్మహత్యకు పాల్పడుతుంది. చిట్టిని చేసుకోబోయే విక్కీ కూడా తనని అవమానంగా చూస్తాడు. కిట్టు తన చెల్లిని ఎలా కాపాడుకున్నాడు? తన చెల్లి ఫోటోలను మార్ఫింగ్ చేసిన వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు? చెల్లి పెళ్లి చేశాడా? తన తండ్రి సైడ్ బంధువులందరిని కలిపాడా? కిట్టు గర్ల్ ఫ్రెండ్ అమెరికా నుంచి తిరిగొచ్చిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Bigg Boss 8 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వ‌చ్చే 8 మంది వీరేనా? లిస్ట్‌లో గంగ‌వ్వ‌?

సినిమా విశ్లేషణ.. ఒకప్పుడు అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చేవి. స్టార్ హీరోలు సైతం సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చేసారు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ తో సినిమాలు తక్కువయ్యాయి. చిట్టి పొట్టి సినిమా పూర్తిగా చెల్లి సెంటిమెంట్ తో పాటు బంధువులంతా ఉండాలి అనే ఓ పాయింట్ తో తెరకెక్కించారు. చెల్లి ఫోటోలను మార్ఫింగ్ చేస్తే అన్న ఎలా స్పందించాడు, దూరమైన బంధువులందరిని చెల్లి పెళ్ళికి ఎలా రప్పించాడు అనే కథాంశంతో చిట్టిపొట్టి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. చివరి అరగంట అయితే మంచి ఎమోషనల్ సీన్స్ తో నిండిపోయి ప్రేక్షకులని కూడా కంటతడి పెట్టిస్తారు. అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ తో పాటు, బంధాలు, బంధుత్వాలు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రామ్ మిట్టకంటి అన్నగా, బాధ్యత ఉన్న కొడుకుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చెల్లిగా పవిత్ర ఆ పాత్రలో ఒదిగిపోయింది. రామ్, పవిత్ర ఇద్దరూ సొంత అన్నాచెల్లెళ్లు అనుకునేలా చేసారు. హీరో ఫ్రెండ్స్ పాత్రలో చేసిన ఇద్దరు నటులు అక్కడక్కడా బాగానే నవ్వించారు. కస్వి పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులంతా ఎవరి పాత్రల్లో వారు మెప్పించారు.

Sister Sentiment Chitti Potti Movie Review

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా ఎమోషనల్ సీన్స్ లో మెప్పిస్తుంది. పాటలు ఒకసారి వినొచ్చు. రెగ్యులర్ కథే అయినా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు బంధుత్వాలు కాన్సెప్ట్ కూడా జత చేసి డైరెక్టర్ బాగానే రాసుకొని పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమాల అయినా బాగానే ఖర్చు పెట్టారు.

మొత్తంగా ‘చిట్టి పొట్టి’ సినిమా చెల్లి సెంటిమెంట్, చుట్టాల సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ డ్రామా. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇటీవల చెల్లి సెంటిమెంట్ సినిమాలు మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.