Bigg Boss 8 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే 8 మంది వీరేనా? లిస్ట్‌లో గంగవ్వ?
8 మంది రావడం ఖాయమని బిగ్‌బాస్ చెప్పాడు.

Bigg Boss telugu 8 Wild Card Entry List confirmed
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపల అడుగుపెట్టారు. వారానికి ఒకరు చొప్పున నలుగురు బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ రోజు మిడ్ వీక్ ఎలిమినేట్ కావడంతో మరొకరు ఎలిమినేట్ కానున్నారు. దీంతో హౌస్‌లో కేవలం 9 మంది మాత్రమే ఉంటారు. వీరి నుంచి వీకెంట్ ఎపిసోడ్‌లో మరొకరు ఎలిమినేట్ కావడం ఖాయం. అప్పుడు హౌస్‌లో 8 మంది మాత్రమే ఉంటారు.
బిగ్‌బాస్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే.. వాటిని ఆపే శక్తి కంటెస్టంట్లకు ఇచ్చారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా పలు టాస్కులు నిర్వహించారు. శక్తి, కాంతార క్లాన్స్ కలిసి నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాయి. దీంతో 8 మంది రావడం ఖాయమని బిగ్‌బాస్ చెప్పాడు.
Bigg Boss 8 : మిడ్‌వీక్ ఎలిమినేషన్.. బయటకు వచ్చేది అతడేనా?
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చే 8 మంది ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరైన కొత్త వాళ్లు వస్తారేమో అని అనుకుంటుండగా.. ఇప్పటి వరకు జరిగిన సీజన్లలోని కంటెస్టెంట్లే రాబోతున్నారట. ఇందుకు సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గంగవ్వ పేరు కూడా ఉంది. బిగ్‌బాస్ 4వ సీజన్‌లో అనారోగ్యంతో గంగవ్వ తనను ఎలిమినేట్ చేయమని కోరిన సంగతి తెలిసిందే.
ఆమెతో పాటు హరితేజ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్‌సేలు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరీ వీరిలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తారో.
Rakul Preet Singh : నా పేరును వాడుకోవడం మానేయండి.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్..