Kali Movie : ‘కలి’ మూవీ రివ్యూ.. కలిపురుషుడు వచ్చి..
ఒక వ్యక్తికి లైఫ్ లో కష్టాలు వచ్చి సూసైడ్ చేసుకుందాము అనుకుంటే కలి యుగాన్ని ఏలే కలి పురుషుడు వచ్చి ఏం చేసాడు అనే కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించారు.

Prince Cecil Naresh Agastya Kali Movie Review and Rating
Kali Movie Review : యువ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘కలి’. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా శివ శేషు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కలి సినిమాలో నేహా కృష్ణన్, మణి చందన, CVL నరసింహారావు, కేదార్ శంకర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించగా ప్రియదర్శి, మహేష్ విట్టా, అయ్యప్ప శర్మ వాయిస్ ఓవర్లు ఇచ్చారు. నేడు అక్టోబర్ 4న ఈ కలి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. శివరామ్(ప్రిన్స్) జువాలజీ ప్రొఫెసర్. వేద(నేహా కృష్ణన్) శివరామ్ ని ప్రేమించి ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటుంది. శివరామ్ మంచితనం వల్ల అందరూ అతన్ని మోసం చేస్తారు, అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటాడు. పాప పుట్టినా శివరామ్ మరీ మంచితనం నుంచి మారకపోవడంతో వేద పాపను తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అన్నిరకాలుగా లైఫ్ లో మోసపోయిన శివరామ్ సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. శివరామ్ ఉరి వేసుకునే సమయానికే ఓ వ్యక్తి(నరేష్ అగస్త్య) అతని ఇంటికొచ్చి వర్షం పడుతుందని షెల్టర్ అడుగుతాడు. ఆ వ్యక్తి కలి యుగాధిపతి కలి పురుషుడు అని శివరామ్ కు తెలుస్తుందా? కలి పురుషుడు ఎందుకు శివరామ్ దగ్గరికి వచ్చాడు? శివరామ్ సూసైడ్ చేసుకున్నాడా? శివరామ్ ని వదిలి వెళ్లిన వేద మళ్ళీ వస్తుందా? అసలు కలి ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Bigg Boss 8 : మిడ్‌వీక్ ఎలిమినేషన్.. బయటకు వచ్చేది అతడేనా?
సినిమా విశ్లేషణ.. ఇటీవల చాలా మంది చిన్న చిన్న కష్టాలకు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఆత్మహత్య తప్పని ఒక మెసేజ్ ని ఈ సినిమా రూపంలో థ్రిల్లర్ జానర్ కి చిన్న మైథలాజి టచ్ ఇచ్చి చెప్పారు. సినిమా నిడివి చాలా తక్కువ. కేవలం గంటన్నరే కావడం సినిమాకి ప్లస్సే. కానీ సినిమా ఎక్కువగా శివరామ్, కలి రెండు క్యారెక్టర్స్ మధ్యే సాగడంతో అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టొచ్చు.
ఒక వ్యక్తికి లైఫ్ లో కష్టాలు వచ్చి సూసైడ్ చేసుకుందాము అనుకుంటే కలి యుగాన్ని ఏలే కలి పురుషుడు వచ్చి ఏం చేసాడు అనే కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించారు. సినిమా మొదట్లో నాలుగు యుగాల గురించి సీన్, సినిమా మధ్యలో కలి నివాసం సీన్ చాలా ఆసక్తిగా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తిగా బాగా రాసుకున్నారు. శివరామ్ కి వచ్చిన వ్యక్తి కలి అని తెలిసిన దగ్గర్నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో సూసైడ్స్ తప్పని ఒక మెసేజ్ గా చెప్పినా ఈ సినిమాలో కలి పురుషుడిని తీసుకొచ్చి సూసైడ్ తర్వాత ఏంటి అని ఆసక్తిగా చూపించడంలో సక్సెస్ అయ్యారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు ఫుల్ యాక్టివ్ పాత్రలు చేసిన ప్రిన్స్ ఈ సినిమాలో ఒక మంచివాడి పాత్రలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నరేష్ అగస్త్య కూడా కలి పాత్రలో చాలా సెటిల్డ్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేహా కృష్ణన్, మణి చందన, CVL నరసింహారావు, కేదార్ శంకర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. చివర్లో నటి గాయత్రి గుప్తా అలరించింది. ఇక బల్లికి ప్రియదర్శి, బొద్దింకకు మహేష్ విట్టా, సమయానికి అయ్యప్ప శర్మ వాయిస్ ఓవర్లు ఇచ్చి మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమా చాలా వరకు సింగిల్ లొకేషన్ రాత్రి పూటే తీశారు. దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా చాలా సార్లు డైలాగ్స్ ని, సీన్స్ ని డామినేట్ చేసింది అనిపిస్తుంది. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తుంది. గ్రాఫిక్స్ బాగున్నాయి, కలి పాత్ర, కలి నివాసం డిజైన్ ప్రేక్షకులని మెప్పిస్తాయి. రెగ్యులర్ పాయింట్ తీసుకున్నా కథని కొత్తగా రాసుకొని కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మొదటి సినిమాతోనే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా కావాల్సినంత బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘కలి’ సినిమా సూసైడ్ చేసుకుందాము అనే వ్యక్తి దగ్గరికి కలి యుగాధిపతి కలి పురుషుడు వచ్చి ఏం చేశాడు అని ఓ మెసేజ్ తో ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.