50 వసంతాల అదృష్టవంతులు

50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అదృష్టవంతులు

  • Published By: sekhar ,Published On : January 3, 2019 / 12:05 PM IST
50 వసంతాల అదృష్టవంతులు

50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అదృష్టవంతులు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా, జగపతి పిక్చర్స్ బ్యానర్‌పై, వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో, వి.మధుసూధన రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా, అదృష్టవంతులు… 1969 జనవరి 3న రిలీజ్ అయ్యిన ఈ సినిమా, నేటితో (2019 జనవరి3) దిగ్విజయంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు తర్వాత, 
తమిళ్‌లో తిరుడన్, హిందీలో హిమ్మత్ పేర్లతో రీమేడ్ అవ్వడం విశేషం.

నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించి, జైలు నుండి విడుదలయ్యాక మంచి మనిషిగా మారే రఘు క్యారెక్టర్‌లో ఏఎన్నార్ అద్భుతంగా నటించగా, జయలలిత ఆయనకు ప్రియురాలిగా, భార్యగా, బిడ్డకు తల్లిగా నటించింది. పద్మనాభం, ఏఎన్నార్ ఫ్రెండ్‌గా, గుమ్మడి ఇన్‌స్పెక్టర్ మూర్తిగా అలరించారు. రేలంగి అతిథి పాత్రలో మెరిసిన అదృష్టవంతులు చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీత మందించిన పాటలు ప్రేక్షకులను మైమరపించాయి.

అప్పట్లో, హైదరాబాద్ దీపక్ మహల్, విజయవాడ శ్రీవిజయాటాకీస్, విశాఖపట్టణం వాణీ మహల్, గుంటూరు కృష్ణ మహల్, నెల్లూరు శ్రీనివాస మహల్‌లో ఈ సినిమా 100 రోజులాడింది. రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టిన అదృష్టవంతులు చిత్రానికి రచన : ఆచార్య ఆత్రేయ, కెమెరా : ఎస్.వెంకటరత్నం, ఎడిటింగ్ : ఎన్.ఎస్.ప్రకాష్, ఆర్ట్ : జి.వి.సుబ్బారావు.