Siddharth- Trisha: 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్.. సిద్ధార్థ్ – త్రిష రీ-యూనియన్.. దిల్ రాజు నిర్మాణంలో క్రేజీ మూవీ
సిద్దార్థ్- త్రిష జంటగా సరికొత్త సినిమాను ప్లాన్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు(Siddharth- Trisha).
After 20 years siddharth and trisha doing film with dil raju
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా జోడీ రిటర్న్
- దిల్ రాజు నిర్మాణంలో వింటేజ్ కాంబో
- త్వరలో సిద్ధార్థ్, త్రిషల కొత్త సినిమా షురూ
Siddharth- Trisha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్ హిట్‌గా నిలిచింది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ. ఈ సినిమాలో తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించారు సిద్ధార్థ్-త్రిష జంట. అయితే, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ జంట వెండితెరపై మెరవనుండటం విశేషం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Deepika Padukone: హ్యాట్సాఫ్ దీపికా.. గర్భవతిగా ఉంటూనే ‘రాకా’ షూటింగ్.. యాక్షన్ సీక్వెన్స్ కూడా
ఈ సినిమా షూటింగ్ అంతా విదేశాల్లోనే ప్లాన్ చేశారట. సరికొత్త పాయింట్ తో వస్తున్న ఈ సినిమాలో సిద్దు- త్రిష(Siddharth- Trisha)తో పాటు మరో యువ జంట కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజుతో సిద్దు చేసిన బొమ్మరిల్లు ఎంతటి ఘన విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, దిల్ రాజు మళ్లీ సిద్ధార్థ్‌కు ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు.
మరోవైపు త్రిష సినిమాలకు స్వస్తి పలుకుతున్నారనే పుకార్లు వైరల్ అవుతున్న వేల ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మిస్తారా లేదా డబ్బింగ్ చేస్తారా అనేది త్వరలోనే తెలియనుంది. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే, ఆమె చిరంజీవి సరసన విశ్వంభర, సూర్య సరసన వీరభద్రుడు సినిమాలు చేస్తోంది. మరి ఈ సినిమాలు ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి అనేది చూడాలి.
