After Breakup with Tamannaah Bhatia Vijay Varma love with Fatima Sana Shaikh Rumors goes Viral
Vijay Varma : బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తమన్నాతో రిలేషన్ లో ఉన్నాడని వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం అధికారికంగానే ప్రకటించారు. లస్ట్ స్టోరీస్ సినిమా సమయంలో తమన్నా – విజయ్ క్లోజ్ అయ్యారని, ఇద్దరూ ప్రేమించుకున్నారని చెప్తూ ఒకరి గురించి ఒకరు తెగ పొగిడేశారు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ కలిసి కనిపించి క్యూట్ లవ్ కపుల్ అనిపించుకున్నారు.
కానీ ఏం జరిగిందో ఏమో అంతలోనే ఈ ఇద్దరూ విడిపోయారు. లవ్ స్టోరీ అధికారికంగా చెప్పినా వాళ్ళు విడిపోయింది మాత్రం చెప్పలేదు. కానీ తమన్నా, విజయ్ వర్మ సన్నిహితులు మాత్రం వాళ్ళు విడిపోయారు అనే చెప్తున్నారు. ఈ ఇద్దరూ కూడా కలిసి కనపడట్లేదు. అయితే తాజాగా విజయ్ వర్మ మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ పోస్టర్ ని బాత్రూంలో పెట్టుకున్న హీరోయిన్.. కానీ ఆ హీరో వచ్చాక..
ఫాతిమా సనా షేక్ అనే హీరోయిన్ తో విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నాడట. ఇటీవల వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ కేఫ్ లో క్లోజ్ గా కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ అంటుంది. ఫాతిమా సనా షేక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి దంగల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లూడో, థార్, సామ్ బహదూర్.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. అయితే ఫాతిమా సనా షేక్, విజయ్ వర్మ కలిసి గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారని, ఆ సినిమా కోసమే ఇలా క్లోజ్ గా తిరుగుతున్నారని, వాళ్ళ మధ్య ఏం లేదని, వాళ్ళు ఫ్రెండ్స్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Dil Raju : సీఎం చెప్పారని అవార్డు ఎలా ఇస్తాం.. గద్దర్ అవార్డుల విషయంలో దిల్ రాజు కామెంట్స్ వైరల్..