Salman Khan : సల్మాన్ ఖాన్ పోస్టర్ ని బాత్రూంలో పెట్టుకున్న హీరోయిన్.. కానీ ఆ హీరో వచ్చాక..
హీరోయిన్ తన ఫేవరేట్ హీరో సల్మాన్ ఖాన్ ఫోటోని ఏకంగా బాత్రూంలో పెట్టుకుందట.

Salman Khan Revealed Interesting thing Regarding Kareena Kapoor
Salman Khan : ఒకప్పుడు చాలామంది తమ ఫేవరేట్ హీరో హీరోయిన్స్ ఫోటోలు ఇంట్లో గోడలకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికి అలాంటి అభిమానులు ఉన్నారు. కానీ ఓ హీరోయిన్ తన ఫేవరేట్ హీరో సల్మాన్ ఖాన్ ఫోటోని ఏకంగా బాత్రూంలో పెట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ చెప్పాడు.
సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో.. కరీనా కపూర్ చిన్నప్పుడు నా ఫోటోని తన బాత్రూంలో పెట్టుకుందట. ఆమె నాకు పెద్ద ఫ్యాన్ అప్పుడు. కానీ రాహుల్ రాయ్ వచ్చాక నా ఫోటో తీసి అతని ఫోటో పెట్టుకుందని చెప్పింది అని తెలిపాడు.
Also Read : Dil Raju : సీఎం చెప్పారని అవార్డు ఎలా ఇస్తాం.. గద్దర్ అవార్డుల విషయంలో దిల్ రాజు కామెంట్స్ వైరల్..
కరీనా హీరోయిన్ అయ్యాక సల్మాన్ తో కలిసి భజరంగి భాయ్ జాన్, బాడీగార్డ్, క్యోన్ కి, దబాంగ్ 2 .. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక కరీనా సల్మాన్ పోస్టర్ ని తీసేసి మరీ రాహుల్ రాయ్ పోస్టర్ ని పెట్టుకుందంటే అతను ఎవరో తెలుసా?
బాలీవుడ్ లో 1990లో వచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీ సినిమా ‘ఆషికీ’ హీరో రాహుల్ రాయ్. అప్పటివరకు సైడ్ క్యారెక్టర్స్, చిన్న చిన్న పాత్రలు వేసుకునే రాహుల్ రాయ్ ఆషికీ సినిమాతో పెద్ద హిట్ కొట్టి అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. ఆషికీ తర్వాత రాహుల్ రాయ్ కేవలం 10 రోజుల్లో 40 సినిమాలను ఓకే చేసాడు. కానీ అనేక కారణాలతో అందులో చాలా సినిమాలు ఆగిపోయాయి. బాలీవుడ్ అంతా రాహుల్ రాయ్ స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు కానీ కనుమరుగయ్యాడు. అదే సమయంలో షారుఖ్, సల్మాన్ కూడా హీరోలుగా ఎదుగుతున్నారు. వాళ్ళు కావాలని రాహుల్ రాయ్ ని తొక్కేశారని అప్పట్లో బాలీవుడ్ లో ప్రచారం కూడా జరిగింది.
Also Read : Kannappa : దేవుడి సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ లేదా? ‘కన్నప్ప’కు సెన్సార్ యూ/ఏ ఎందుకు ఇచ్చారు?